Balagam Kavya :
ఈ మధ్య హీరోయిన్లు సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తున్నారు. ఒక సినిమాతోనే పాపులర్ అయిపోయి తరువాత అవకాశాల కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నిర్మాతల నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బలగం ఫేమ్ కావ్య కూడా పెద్ద హీరోలతో జతకట్టాలని కలలు కంటోంది. ఇందులో భాగంగానే అవకాశాలు రావాలని సామాజిక మాధ్యమాల్లో పొట్టి డ్రెస్సులతో అందాలు ప్రదర్శిస్తోంది.
బలగం సినిమాతో తన ప్రతిభ చూపిన కావ్య తన భవిష్యత్ పెద్ద హీరోలతో సాగాలని ఆలోచిస్తోంది. దీని కోసం తెగ హడావిడి చేస్తోంది. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టే హీరోయిన్ గా మారింది. కావ్య కల్యాణ్ రామ్ మసూద సినిమాతో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది. ఈ హర్రర్ డ్రామా హిట్ గా మారడంతో ఆమె కెరీర్ ముందుకెళ్తుందని భావించింది.
దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కించిన బలగం సినిమా సంచలనాలు నమోదు చేసింది. అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించుకుంది. వేణుకు క్రేజీ పెరిగింది. తెలంగాణ జీవన విధానాన్ని తెరకెక్కించిన వేణు విధానం అందరికి నచ్చింది. ఇందులో నటించిన కావ్యకు కూడా సత్కారాలు దక్కాయి. ప్రస్తుతం శ్రీసింహకు జంటగా ఉస్తాద్ సినిమాలో నటిస్తోంది. కానీ పెద్ద హీరోలతో నటించాలని కావ్యకు ఆశగా ఉంది.
కావ్యకు ఉస్తాద్ కూడా మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతోంది. పెద్ద హీరోలతో నటిస్తేనే బాగా ప్రచారం దక్కుతుంది. చిన్న హీరోలతో నటిస్తే అంతే సంగతి. కనీసం శర్వానంద్, నితిన్, నాగచైతన్య లాంటి హీరోల సరసన కూడా చాన్స్ రావడం లేదనే ఆమె బాధపడుతోంది. త్వరలో ఆమె ఆశలు తీరే అవకాశాలు రానున్నాయని ఎదురు చూస్తోంది.