
KCR contesting in Maharashtra : ఉద్యమ పార్టీని రాజకీయ పార్టీ (బీఆర్ఎస్)గా మార్చి దేశంలో చక్రం తిప్పాలని అనుకుంటున్నారు కేసీఆర్. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ పార్టీలో ఒడిసా, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కొందరిని చేర్చుకున్నారు. అయితే కేసీఆర్ చూపు ఎక్కువగా మహారాష్ట్రపైనే ఉంది. దేశంలో అతిపెద్ద రాష్ర్టాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి. ఇక్కడ 48 పార్లమెంట్ స్థానాలు, ఎక్కువ సంఖ్యలో రైతులు ఉండటం, అందునా తెలంగాణ సరిహద్దు రాష్ర్టం కావడంతో కేసీఆర్ ఆ రాష్ర్టంపై బాగా ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఇప్పటి వరకూ ఇతర రాష్ర్టాలతో పోల్చుకుంటే మహారాష్ట్రలోనే ఎక్కువ సభలు నిర్వహించారు ఆయన. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లేదా.. నాందేడ్ నుంచి పోటీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ రెండు కూడా తెలంగాణ సరిహద్దు జిల్లాలు కావడం విశేషం.
పార్టీ నేతలు దీనికి అనుగుణంగా నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున ప్రలోభాలకు గురి చేసి వివిధ పార్టీల నేతలను, కార్యకర్తలను బీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు. ఔరంగాబాద్ లో ముస్లిం జనాభా ఎక్కువ. ప్రస్తుతం అక్కడ ఎంపీ మజ్లిస్ పార్టీకి చెందిన వాడే. మజ్లిస్, బీఆర్ఎస్ సొంత అన్నదమ్ముళ్లా కలిసి ఉంటారు కాబట్టి తెలంగాణలో ముస్లిం జనాభా ఉన్న ఎంఐఎంకు సీటు విడిచిపెట్టి ఔరంగాబాద్ సీటు తీసుకోవాలని చూస్తున్నారు కేసీఆర్. మిత్ర ధర్మంలో అసొదుద్దీన్ కూడా ముస్లింలను కేసీఆర్ వైపునకు తిప్పుతారని ఆశిస్తున్నట్టు సమాచారం.
ఔరంగాబాద్ వీలు కాకుంటే నాందేడ్ నుంచి పోటీ చేసినా అనుకూలంగా ఉంటుందని కేసీఆర్ ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నారు. నాందెడ్ లో ఎప్పుడూ అభ్యర్థిని మారుస్తుంటారు అక్కడి ఓటర్లు. ఆ సారి అక్కడ బీజేపీ ఎంపీ ఉన్నారు. 2014లో అక్కడి నుంచి పోటీ చేస్తే కొత్తగా వచ్చిన తనను ఆదరిస్తారని అనుకుంటున్నాడు అధినేత. మహారాష్ర్టలో ఇప్పుడు శివసేనలోని కార్యకర్తలు ఎక్కువగా బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలుస్తోంది. వారికి బీఆర్ఎస్ పార్టీ భారీగా నగదు అందజేయడంతో పాటు మరిన్ని వరాలు ఇచ్చి చేర్పించుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.