35.7 C
India
Tuesday, April 23, 2024
More

    గుర్తింపు కోస‌మే కేసీఆర్ తాప‌త్రాయం..!

    Date:

    kcr
    kcr

    నిజాం రాజులు ఎంత‌టి నిరంకుశులో తెలిసిందే. సుమారు 224 ఏళ్ల పాటు నైజాం స్టేట్‌ను ఏక‌చ‌త్రాధి ప్య‌తంగా పాలించారు. నిజాం పాల‌నా కాలంలో వారి చెప్పిందే వేదం.చేసిందే శాస‌నం. అయితే నైజాం ప్ర‌భువులు ఇంతటి నియంత‌లు అయిన‌ప్ప‌టికీ.. దేశ‌,రాష్ట్ర చ‌రిత్ర‌లో వారికంటూ ప్ర‌త్యేక పేజీలున్నాయి.  వారు అనివార్యంగానో,ఇత‌ర కార‌ణాల వ‌ల్ల‌నో చేసిన కొన్ని ప‌నుల వ‌ల్ల‌ హీస్ట‌రీలో స్థానం సంపాదించు కున్నారు. గుర్తింపు కూడా తెచ్చుకున్నారు.

    ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా స‌రిగ్గా ఇలాంటి వ్య‌వ‌హార శైలినే అనుస‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కేసీఆర్‌కు తిరుగే లేదు. రాజ‌కీయంగా ఆయ‌న‌కు స్టేట్‌లో మంచి హోల్డ్ ఉంది. ఇప్ప‌టికే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారనే గొప్ప పేరును సంపాదించుకున్నారు. అయితే ఇంత‌టితో ఆగ‌కుండా చ‌రిత్ర‌లో త‌న పేరు చిర‌స్థాయిగా నిలిచిపోవాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకుంటున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. హైద‌రాబాద్‌లో నిజాం రాజులు క‌ట్టిన చారిత్ర‌క క‌ట్ట‌డాల వ‌ల్ల వారికి మంచి గుర్తింపు వ‌చ్చింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ ట్యాంక్ బ్యాండ్‌పై చేసిన అభివృద్ధి ప‌నుల‌ను ఇప్ప‌టికీ ప‌బ్లిక్ మెచ్చుకుంటూనే ఉన్నారు. బుద్ధ విగ్ర‌హాం,లుంబినీ పార్క్ అభివృద్ధి,ట్యాంక్ బండ్‌పై విగ్ర‌హాల ఏర్పాటు వంటి ప‌నులు ఎన్టీఆర్‌కు మంచి పేరును తెచ్చి పెట్టాయి.

    అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌కు మాత్రం హైద‌రాబాద్‌లో త‌న‌కంటూ చెప్పుకునేందుకు చారిత్ర‌క క‌ట్ట‌డాల‌కు సంబంధించిన‌ గుర్తులు లేకుండాపోయాయి. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఆ లోటును భ‌ర్తీ చేసుకునేందుకు కొత్త స‌చివాల‌యం,కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణం,నూత‌న జిల్లాల ఏర్పాటు,యాదాద్రి ఆల‌య అభివృద్ధి వంటి కార్య‌క్ర‌మాల‌కు పూనుకున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇలాంటి ప‌నులు చేయ‌డం ద్వారా భ‌విష్య‌త్ త‌రాల్లో కేసీఆర్ మార్క్ చిర‌స్థాయిగా ఉండేలా చూసుకోవాల‌ని ఆయ‌న భావిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Esha Deol : ఇషా డియోల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా?

    Esha Deol : ఇషా డియోల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా అంటే...

    IPL 2024 : ఐపీఎల్ లో ఇప్పటివరకు ఎవరెన్నీడాట్ బాల్స్ వేశారంటే..

    IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్ లో బ్యాటర్లు దుమ్ము...

    Viral News : ఈ చిన్నది ఇప్పుడు అందానికే అసూయ తెప్పిస్తున్నది..

    Janhvi Kapoor Childhood Pic, Viral News Viral News : సోషల్...

    Mix up : మిక్స్ అప్ చూస్తే మతిపోవాల్సిందే..  ఇదేం కథరా బాబు

    Mix up : ఓటీటీ ప్లాట్ పామ్స్ వచ్చిన తర్వాత ఎన్నోరకాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్

    KCR React Kavitha Arrest : కవిత అరెస్టుపై తొలిసారి కెసిఆర్...

    KCR : కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు కేసీఆర్ బిగ్ స్కెచ్!

    KCR : చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. అధికారంలో...

    Warangal BRS Candidate : వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవ్వరూ ఊహించని వ్యక్తి

    Warangal BRS Candidate : వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి...

    CM Revanth : జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని.. కేసీఆర్ కు సీఎం వార్నింగ్

    CM Revanth : కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ వేదికగా మేనిఫెస్టో విడుదల...