21.6 C
India
Wednesday, February 11, 2026
More

    KCR says BJP : బీజేపీ, మోదీని మాటనని కేసీఆర్.. దేనికి సంకేతం..?

    Date:

    KCR says BJP
    KCR says BJP

    KCR says BJP : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెసమీట్ ల్లో, బహిరంగ సభల్లో ప్రత్యర్థులపై తనదైశన శైలిలో విరుచుకుపడుతుంటారు. రాష్ర్ట రాజకీయాల్లో వేలు పెట్టే ఏ ఒక్కరినీ ఆయన వదలరు. తన మాటలతో క్యాడర్ లో జోష్ నింపుతూనే, అవతలి వారిని తన మాటలతో చీల్చి చెండాడుతారు. అయితే కొంతకాలంగా ఆయన జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పేరిట టీఆర్ఎస్ ను రూపాంతరం చేశారు. బీజేపీకి ప్రత్యామ్నాయం తామే అంటూ చెప్పుకొచ్చారు.

    బీజేపీ, కాంగ్రెస్ లపై కొంత కాలంగా విరుచుకుపడుతున్నారు. ఆ రెండు పార్టీలను పారదొలితేనే దేశం అభివృద్ధి సాధ్యమని చెప్పుకొస్తున్నారు. అబ్ కి బార్ కిసాన్ సర్కారు పేరిట తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. మహారాష్ర్టలో మూడు బహిరంగ సభలను ఏర్పాటు చేసి, పార్టీ క్యాడర్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఏపీలోనూ తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పార్టీ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టించారు. కర్ణాటక వైపు కూడా వెళ్తారనుకున్నా, మొన్నటి ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించలేదు. ఇక జాతీయ రాజకీయాల్లో బీజేపీ అంతు చూస్తానని ఒక రేంజ్ లో మాట్లాడిన సీఎం కేసీఆర్ కొన్ని రోజులుగా సైలెంట్ అయ్యారు. ఇందులో రాజకీయ పరమైన ఎత్తుగడ ఉందా.. మరేదైనా కారణముందా అనేది ఆయనకే తెలియాలి.

    తాజాగా ఆదివారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్, బీఆర్ఎస్ భవన్ ఓపెనింగ్ లో భాగంగా సీఎం కేసీఆర్ అక్కడ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దేశమంతా తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నదని చెప్పారు. తొమ్మిదేళ్లలో జరిగిన ప్రగతి, సాధించిన విజయాలు, సాధించుకున్న అభివృద్ధిని గుర్తు చేశారు. ఇక్కడి పథకాలను మహారాష్ర్ట ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.  అయితే ఆయన చివరలో ఒక్క కాంగ్రెస్ పైనే విమర్శనాస్ర్తాలు ఎక్కుపెట్టారు. ధరణిని బంగాళఖాతంలో కలిపేద్దామని అంటున్న కాంగ్రెస్ నే బంగాళఖాతంలో కలిపేద్దామని పిలుపునిచ్చారు. అయితే సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో ఎక్కడా బీజేపీ, మోదీ పేరెత్తలేదు. సాధారణంగా ఆయన ప్రసంగమంటే వాడీవేడిగా ఉంటుంది. ఇది ఆయన అనుచరుల్లో ఎక్కడా లేనంతగా జోష్ నింపుతుంది. అయితే ఈ సారి ఆయన ప్రసంగా సప్పగా ఉందని అంతా చర్చించుకుంటున్నారు.

    అయితే బీజేపీ, మోదీ పై సీఎం కేసీఆర్ వైఖరి మారిందని అంతా అనుకుంటున్నారు. కేంద్రం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కూతురు కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. అయితే ఈ సమయంలో కయ్యానికి కాలు దువ్వడం మంచిది కాదనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. ఆయన టీంలోని కొందరు ఇప్పటికే బీజేపీ కేంద్ర పెద్దలతో టచ్ లో ఉన్నారని కవిత అంశం ఇక మరుగునపడేసే ప్రయత్నం చేశారని టాక్. అయితే కేంద్రం సహకరిస్తున్నందన విమర్శించకపోవడమే బెటర్ అనే ఆలోచనలో ఆయన ఉన్నారట.

    అయితే సీఎం కేసీఆర్ సాఫ్ట్ వైఖరి రాష్ర్ట బీజేపీ నేతలకు మాత్రం మింగుడు పడడం లేదు. ఆయన ఎంత తిడితే అంత మైలేజీ పెరుగుతుందనే భావనలో వారు ఉన్నారట. ఈ సమయంలో తమ పార్టీ ఊసెత్తకపోతే తమ పరిస్థితి ఏంటని వారు అనుయాయులతో చర్చిస్తున్నారట. ఏదేమైనా రాష్ర్టంలో ఏదో ఒక ఇష్యూను బేస్ చేసుకొని తమ పోరాటం కొనసాగిద్దామని వారు అనుకుంటున్నారట. కాంగ్రెస్ ను మాత్రమే కేసీఆర్ టార్గెట్ చేస్తే ఇది వారి పార్టీకి మేలు చేస్తుందని బీజేపీ రాష్ర్ట నాయకుల మాట. మరి రానున్న ఐదు నెలల కాలంలో కేసీఆర్ ఎలా తన రాజకీయ ఎత్తుగడలు మారుస్తారో వేచి చూడాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bangladesh : నేను బంగ్లా దేశియున్ని…నా ఈక కూడా మీరు పీకలేరు..

    Bangladesh : "నేను బంగ్లా దేశియున్ని... నా ఈక కూడా మీరు పీకలేరు......

    Ilayaraja : మోడీ ఒక అసమాన నాయకుడు : ఇళయరాజా

    Ilayaraja : సంగీత దిగ్గజం ఇళయరాజా ఇటీవల భారతదేశ ప్రధాన మంత్రుల గురించి,...

    Modi : మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ.. ఎవరీమె?

      Modi Security : భారతీయ విదేశాంగ సేవ (IFS) అధికారిణి నిధి...

    Private car owners : ప్రైవేటు కారు యజమానులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్!

    private car owners : జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే ప్రైవేటు కారు...