22.7 C
India
Tuesday, October 6, 2026
More

    KCR six Page Ads : తెలంగాణ ప్రజాధనం వృథా.. పశ్చిమ బెంగాల్ పత్రికల్లో కేసీఆర్ ఆరు పేజీల యాడ్స్!

    Date:

    KCR six page ads
    KCR six page ads

    KCR six page ads : తమ హంగు, ఆర్భాటాల కోసం కేసీఆర్ తెలంగాణ ప్రజల ధనాన్ని స్వాహా చేస్తున్నారా అంటే అవుననే వినిపిస్తోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల యాడ్స్ ఇక్కడ వేసుకుంటే ఒకే.. సొంత రాష్ట్రం కాబట్టి.. కానీ తెలంగాణ అభివృద్ధి చూడండహో అంటూ పశ్చిమ బెంగాల్ లో వేయడంపై తెలంగాణ ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. తన పార్టీ ప్రచారం చేసుకునేందుకు ప్రజా ధనం వృథా చేయడం ఏంటని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.

    కేసీఆర్ ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్చారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని యోచిస్తున్న ఆయన అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. పశ్చిమ బెంగాల్ లోని ఓ స్థానిక పత్రికలో మొదటి ఆరు పేజీల్లో కేసీఆర్ శుక్రవారం (జూన్ 2) కనిపించారు. మొదటి ఆరు పేజీల్లో కేసీఆర్, బీఆర్ఎస్ కు సంబంధించిన ప్రకటనలు కనిపించాయి.

    తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి చెబుతూ యాడ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ విడ్డూరం ఏమిటంటే కేసీఆర్ ఇంకా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించలేదు. తన పార్టీ ఉనికి కూడా లేని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కేసీఆర్ 6 పేజీల యాడ్స్ ఇవ్వడంపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలో ఇటీవల ఒక కార్పొరేటర్ సీటు గెలిచారు. అక్కడ యాడ్ ఇస్తే ఇక్కడి ప్రజల ధనమే అయినా సరేలే అనుకోవచ్చు. కానీ ఏదీ లేని పశ్చిమ బెంగాల్ లో ఇవ్వడంపై పలువురు గుస్సా అవుతున్నారు.

    నేషనల్ ఫ్రంట్ పెడుతున్నారని కొందరు అంటుంటే, ఈ ప్రచార కార్యక్రమాల కోసం ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలు ఇప్పట్లో ముగియనుండడంతో కేసీఆర్ వేగంగా వ్యవహరిస్తుండడం, విస్తృతంగా మీడియా కవరేజ్ అందుకు సంకేతం. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయగలరా..? లేదా..? అనేది వేచి చూడాలి మరి.

     

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Encounter : కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్: 30 మందికి పైగా మావోయిస్టులు మృతి?

    Encounter : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల అటవీ ప్రాంతం మరోసారి రక్తసిక్తమైంది....

    Telangana : హెచ్‌సీయూ విద్యార్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

    Telangana Deputy CM : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...

    Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్.. ఆమె ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

    Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌...

    Telangana : తెలంగాణ లో ఉగాది తర్వాత ముఖ్యమంత్రి మార్పు..!

    -తీన్మార్ మల్లన్న వెనుక రేవంత్ రెడ్డి..? Telangana  CM : ఉగాది పండుగ...