
KCR spending : రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకుంటుందా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. రాష్ట్రం సిద్ధించి జూన్ 2వ తేదీ నాటికి సరిగ్గా పదేళ్లవుతుంది. ఈ పదేళ్లలో వేడుకలు సాదాసీదాగా నిర్వహించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు హంగూ, ఆర్భాటాలను జొప్పించింది. ఆసాంతం పార్టీ ప్రచారం కోసం వేడుకలను మరింత గ్రాండ్ గా నిర్వహిస్తోంది.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అంటే ఎలా ఉండాలి.. రాష్ట్రం ఎందుకు విడిపోవాల్సి వచ్చింది..? అమర వీరులను గుర్తు చేసుకోవడం..? కొత్త రాష్ట్రం మరింత ముందుకు వెళ్లేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలో చర్చించడం..? ఉండాలి. కానీ యాడ్స్, హంగులు, ఆర్భాలు ఎందుకు అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా యాడ్స్ వేస్తూ కోట్లాది రూపాయల తెలంగాణ డబ్బును పార్టీ ప్రచారానికి వాడుకుంటున్నారు కేసీఆర్ అంటూ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు తెలంగాణ ప్రజలు.
ఆవిర్భావం రోజు జూన్ 2వ తేదీనే దాదాపు రూ. 150 కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. దాదాపు అన్ని పేపర్లలో కేసీఆర్ నిలువెత్తు బొమ్మలను వేశారు. ఈ ప్రచారమే వేడుకలు ముగిసే వరకూ అంటే 21 రోజుల పాటు ఉంటుందని అధికర వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఎన్నికలు వస్తున్న వేల పీఆండ్ఆర్ శాఖకు రూ. 1000 కోట్లను కూడా అందుకే కేటాయించారని వార్తలు వినిపిస్తున్నాయి. అంబేడ్కర్ విగ్రహం ఆవిర్భావం నుంచి చూస్తే దాదాపు రూ. 300 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో సెక్రటేరియల్ ప్రారంభం కూడా ఉంది. వీటి కోసం దేశ వ్యాప్తంగా జాతీయ మీడియా సంస్థలకు కూడా ఆయన యాడ్స్ ఇచ్చారు.
ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. సొంత డబ్బా కొట్టుకునేందుకు ప్రభుత్వ పైసలను ఎందుకు వాడుతున్నారు అంటూ మండిపడుతున్నారు. జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ డబ్బులు వాడుకో.. కానీ ప్రభుత్వ ఖజానా నుంచి జనం డబ్బుతో పక్క రాష్ట్రాల్లో డప్పు కొట్టుకోవడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.






