31.8 C
India
Wednesday, September 16, 2026
More

    KCR : 19న ఫామ్‌హౌస్ నుంచి బయటకు కేసీఆర్ !

    Date:

    KCR : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు రెడీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బయటకు రాని ఆయన ఇప్పుడు పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 19వ తేదీన తెలంగాణ భవన్ కు రావాలని కార్యవర్గ సభ్యులందరికీ సమాచారం పంపారు. పార్టీ కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొన్ని కిలక నిర్ణయాలను ప్రకటించే ముందు కేసీఆర్ ఇలాంటి సమావేశాలను ఏర్పాటు చేస్తారు.

    ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు. ఈ కారణంగా బీజేపీని గెలిపించడానికే ఈ నిర్ణయం తీసుకుందన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఇలాంటి సమయంలో .. ఆ ప్రచారం ఉధృతంగా జరిగితే మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. దీనికి చెక్ పెట్టడానికి కేసీఆర్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ తో పాటు బీజేపీపై కూడా ఈ సమావేశంలో విమర్శలు చేసే అవకాశం ఉంది. అయితే కార్యకవర్గ సమావేశాల్లో మాట్లాడిన విషయాలు బయటకు వస్తాయి కానీ.. ఎప్పుడూ రికార్డెడ్ గా బయటకు రావు. రికార్డు చేస్తారో లేదో స్పష్టత ఉండదు.

    ఇటీవల వారానికో సారి అయినా పార్టీ నేతలను కలుస్తున్నారు. అప్పుడు కొన్ని ప్రకటనలు చేస్తన్నారు. త్వరలోనే వస్తానని బహిరంగసభ జరుపకుందామని చెబుతున్నారు. గజ్వేల్ లో బహిరంగసభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల ప్రకటన వస్తే అలాంటి సభ పెట్టాలనుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా తేదీలు ప్రకటించలేదు. విస్తృత సమావేశం తర్వాత కేసీఆర్ ఇక రెగ్యులర్ సమావేశాల్లో పాల్గొంటారా..లేకపోతే మళ్లీ ఫామ్ హౌస్‌కు వెళ్తారా అన్నది అప్పటి పరిస్థితుల్ని బట్టి నిర్ణయించుకునే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Gachibowli : గచ్చిబౌలిలోని 400 ఎకరాల అసలు కథ: రాజకీయ ఆరోపణలు, చారిత్రక వాస్తవాలు

    Gachibowli : గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూమి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో...

    CM Revanth Reddy : కేసీఆర్ ను జైల్లో పెట్టించే హామీ బాకీ ఉంది : సీఎం రేవంత్ రెడ్డి

    CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి...

    KCR : అసెంబ్లీలో కేసీఆర్.. అరుదైన సీన్

    KCR : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు....

    KCR : నేను కొడితే మామూలుగా ఉండదు.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

    KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర...