
CM broke records : తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కాలం పనిచేసిన సీఎంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. గతంలో చంద్రబాబుపై ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. రెండు పర్యాయాలు గెలిచిన కేసీఆర్ ఎటువంటి వ్యతిరేకత లేకుండా పని చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు చాలా శ్రమించారు. ఉద్యమ పార్టీ అండతో గెలిచిన ఆయన రాజకీయ పార్టీ పెట్టి జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా కరసత్తు చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని పూర్తిగా అనచివేశారు. చంద్రబాబు సీఎంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం ఆయన తన డిప్యూటీ స్పీకర్ పదివికి రాజీనామా చేసి ఉద్యమంలో చేరారు. ప్రొఫెసర్ జయశంకర్ సర్ సూచనల మేరకు ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పార్టీని పెట్టారు కేసీఆర్. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో ప్రత్యేక ఉద్యమాన్ని పూర్తిగా అణగదొక్కారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత కేసీఆర్ స్వరాష్ట్ర ఉద్యమాన్ని వేగంగా ముందుకు నడిపారు. ఉద్యమ కార్యాచరణతో పాటు ఆయన కూడా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. దీంతో ఆ సమయంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ దిగివచ్చి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమయంలో టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వంలో విలీనం చేస్తానని చెప్పారు కేసీఆర్. కానీ ఆ తర్వాత చేయలేదు.
టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై తెలంగాణ రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో పోటీ చేశారు కేసీఆర్. 119 అసెంబ్లీ సీట్లకు గానూ 63 గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మె్ల్యేలను తన పార్టీలో కలుపుకొని ప్రతిపక్షం లేకుండా చేశారు. 2019 ఎన్నికల్లో 119 స్థానాలకు గానూ 88 స్థానాలు సాధించి రెండో సారి కూడా ఆయనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయన 9 సంవత్సరాల పదవీకాలం పూర్తి చేశారు. ఆయన తర్వాతి స్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు, తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వరుసగా ఉన్నారు.






