BRS Party KCR : మంగళవారం రోజు వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నాల్గవ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో భాగంగా రాష్ట్ర ఫిల్ము, టీవీ మరియు థియేటర్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేసారు.. తెలుగు సినిమాలను ఆంధ్రప్రదేశ్ లో చిత్రీకరించిన కూడా ఎటువంటి శిక్ష లేకుండా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్ళకు దండం పెట్టి అడుగుతున్నా అంటూ పోసాని చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఏపీలో ఉచితంగా సినిమాలు తీసుకోవచ్చని ఈయన చెప్పారు. అలాగే తెలంగాణలో స్థలాలు ఇచ్చారు కదా అక్కడ ఎందుకు తీయరు? అని అంటారు.. ఇక ఆంధ్రప్రదేశ్ లో స్థలాలు ఇస్తాం అని చెప్పాము కదా ఇక్కడ ఎందుకు ఉండరు? ఇలా టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ విడిపోవడంతో కటింగ్.. ఫిటింగ్ అయిపోయిందంటూ ఈయన చెప్పుకొచ్చారు.
ఇంకా పోసాని విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పూనుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేసీఆర్ ను హృదయపూర్వకంగా కోరితే సాయం చేస్తారు అని తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ తోనే తెలంగాణ ముడిపడిపోయింది అని ఆయనను కోరితే అర్ధం చేసుకుంటారు అని ఆయనకు మన బాధలన్నీ చెప్పి ఒప్పించాలని ఆయన చెప్పుకొచ్చారు..
కేసీఆర్ ను ఆంధ్రప్రదేశ్ లోను సినిమాలు చేసుకునేందుకు సాయం చేయమని ఆయన వినకపోతే కాళ్ళు పట్టుకుని అయిన ఒప్పిస్తాం అని అలా కాకుండా జీవో పెడితే కేసీఆర్ గారు చించి బయట పడేసి తెలంగాణ నుండి బయటకు వెళ్ళండి అంటే మనమేం చేస్తాం అని పోసాని మీడియాతో తెలిపారు..
ReplyForward
|