Keerthy Suresh: సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన కొన్ని వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల ప్రేమ, పెళ్లి వార్తలకు కొదవలేదు. అయితే ఆ తర్వాత ఆ వార్తలపై హీరోయిన్లు క్లారిటీ ఇవ్వడంతో వాటికి ఫుల్ స్టాప్ పడుతూ వస్తుంది. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఇటీవల పెళ్లి వార్తలతో ట్రెండ్ అవుతోంది. కీర్తి సురేష్ పెళ్లి గురించి ఇప్పటి వరకు చాలా వార్తలు వచ్చాయి. వాటిని కూడా ఆమె ఖండించారు. ఈమె సంగీత దర్శకుడు అనిరుధ్‌తో ప్రేమలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్తతో ఆమె పెళ్లి నిశ్చయమైందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే దీనిపై కీర్తి సురేష్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. అంతేకాదు ఆ వార్తల్లో నిజం లేదని సున్నితంగా కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే మరోసారి కీర్తి సురేష్ పెళ్లి వార్త వైరల్ అవుతోంది. తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోవడానికి కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని, గోవా బీచ్‌లో వివాహ వేదికను ఫిక్స్ చేశారని బాలీవుడ్ మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. తాజాగా సౌత్ మీడియాలో కూడా ఈ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు కీర్తి నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. దీంతో ఈ వార్తల్లో నిజం వుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.