Keerthy Suresh Love : ‘కాసిన చెట్టుకే రాళ్ల దెబ్బలు’ ఈ నానుడి ఇండస్ట్రీలోని నటీ నటులకు బాగా నప్పుతుంది. కెరీర్ పీక్ లో ఉండగా ఏన్నో రూమర్స్ వస్తుంటాయి. వీటికి సమాధానాలు చెప్పుకుంటూ పోతే ఇక అక్కడే ఆగాల్సి ఉంటుంది. అందుకే వాటిని పక్కన పెడుతూ ముందుకెళ్తుంటారు హీరో, హీరోయిన్లు.
అయితే, కీర్తి సురేశ్ కు ఎఫైర్ ఉందంటూ సోసల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. గతంలో కూడా ఆమె క్లాస్ మెంట్ తో పెళ్లి అంటూ పుకార్లు వచ్చాయి. ఇలా ఏదో ఒక వార్త పుట్టుకస్తూనే ఉంది. అయితే సందర్భం దొరికినప్పుడల్లా ఖండిస్తూనే ఉన్నారు. ఒకటి ఖండించిన తర్వాత మరోటి.. ఇలా పుట్టుకస్తూనే ఉన్నాయి. ఈ సారి ఆమె తన పర్సనల్ డ్రైవర్ ను ప్రేమించింది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఒక వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు రాగా.. వాటి చుట్టూ కథనాలు అల్లి బయటకు వదులుతున్నారు గాసిప్ రాయుళ్లు.
కీర్తి సురేశ్ కెరీర్ పీక్ లో ఉంది. ఆమె ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఒక స్టార్ హీరో ప్రపోజ్ చేశాడు. కానీ ఆమె రిజక్ట్ చేసింది. కానీ తన పర్సనల్ డ్రైవర్ తో ఆమె లవ్ లో ఉందంటూ గాసిప్ రాయుళ్లు వైరల్ వార్తలను బయటకు వదిలారు. ఆమె అతనితో కలిసి ఉన్న ఫొటోలను కూడా యాడ్ చేశారు. అయితే వీటిపై ఆమె ఏవిధంగా కూడా స్పందించలేదు. చాలా లైట్ గా తీసుకున్నట్లు తెలస్తోంది.
అసలు ఈ ఫొటోల వెనుక స్టోరీని తెలుసుకుందాం. కీర్తి సురేశ్ చిరంజీవితో కలిసి భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. అయితే షూటింగ్ సమయంలో ఓ టెక్నీషియన్ తో కొంచెం సన్నిహితంగా వ్యవహరించింది. ఆయన సెల్ఫీ తీసుకొని తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకున్నాడు. వీటిని చూసిన గాసిప్ రాయుళ్లు రూమర్లు క్రియేట్ చేశారు. కీర్తి సురేశ్ రీసెంట్ గా తీసిన ‘దసరా’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇంకా ఆమె చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి రూమర్లకు స్పందిస్తూ ఇక్కడే ఆగిపోతే కెరీర్ ముందుకు వెళ్లదని భావించిన ఆమె వీటిని లైట్ గా తీసుకుంటున్నారు.
‘భోళా శంకర్’లో కీర్తి సురేశ్ చిరంజీవి చెల్లిగా నటించారు. స్టార్ హీరోయిన్ చెల్లి పాత్రలు చేయడం అరుదైన విషయమే. రజినీకాంత్ కి కూడా ఈమె చెల్లి పాత్రలో చేసింది. భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల చేయనున్నారు. టీజర్ జూన్ 24న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మెగాస్టర్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది.