
Keerthy Suresh : ఇప్పుడు ఏ హీరోయిన్ ఇంటర్వ్యూ ఇచ్చిన లేదంటే సోషల్ మీడియాలో చాట్ సెషన్ పెట్టిన ముందుగా ఫ్యాన్స్ నుండి ఎదురయ్యే ప్రశ్న పెళ్లి ఎప్పుడు? అని.. వీరు పెళ్లి గురించి స్పందించక పోయిన.. స్పందించినా రూమర్స్ మాత్రం తగ్గవు.. ఎక్కడ ఎప్పుడు ఎలా రూమర్స్ సృష్టిస్తారో వారికే తెలియదు.. మరి ఎప్పటి నుండో మహానటి కీర్తి సురేష్ పెళ్లిపై కూడా పలు రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
కీర్తి సురేష్ ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది.. నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమాతో మంచి హిట్ అందుకుంది.. ఆ తర్వాత చేసిన సినిమానే మహానటి.. ఇక ఈ సినిమాతో ఏకంగా కీర్తి జాతీయ అవార్డును అందుకుని సంచలనం క్రియేట్ చేసింది.. కీర్తి సురేష్ ఈ రేంజ్ లో నటనను కనబరుస్తుంది అని ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేయలేదు.. దీంతో ఈమె నటనకు అంతా ఫిదా అయ్యారు..
ఇక ఈమె అప్పటి నుండి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.. తాజాగా దసరా సినిమాతో మరో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ తన నటనతో మరోసారి మెప్పించింది. ఇది పక్కన పెడితే ఈమె పెళ్లి మేటర్ ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతుంది. కీర్తి సురేష్ తో ఒక వ్యక్తి సన్నిహితంగా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆ వ్యక్తి పుట్టినరోజు కావడంతో ఈమె బర్త్ డే పార్టీలో దిగిన ఫోటోను షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది.. అతడు ఎవరా అని ఆరా తీయగా ఫర్హాన్ బీన్ లియాఖత్ అని తెలుస్తుంది. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారి.. ఆస్థి, అంతస్తులో ఈమెకు సరిజోడి.. మరి ఈ జోడి నుండి త్వరలోనే పెళ్లి ప్రకటన రానుంది అని తాజా సమాచారం.. చూడాలి ఈ మ్యాటర్ ఎంత వరకు నిజమో..