
Keshineni : విజయవాడ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కేశినేని సోదరుల మధ్య జరుగుతున్న ఘర్షణ తీవ్ర రూపం దాల్చుతోంది. టీడీపీ నుంచి మానుకున్న మాజీ ఎంపీ కేశినేని నాని, తన సోదరుడు, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని పై వరుసగా అవినీతి ఆరోపణలు చేస్తున్నాడు. ఉర్సా ఐటీ సంస్థ వ్యవహారంతో మొదలైన వివాదం మద్యం కుంభకోణం, షెల్ కంపెనీలు వరకు వెళ్లింది.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. నానికి ఎదురుదాడి చేస్తూ, ఆయనకే ఆర్థిక అక్రమాల ఆరోపణలు చేశారు. వైసీపీ అజెండాను నాని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు మౌనం వహిస్తున్న సమయంలో కొలికపూడి అడుగులు రాజకీయంగా ఆసక్తికరమైన మలుపుని సూచిస్తున్నాయి.ఈ వివాదం ఇంకా ముదిరితే, తెలుగుదేశం పార్టీలో పెను దుమారం తేల్చే అవకాశముంది.