Kesineni Nani : తాను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు పొడవలేదని టిడిపి ఎంపీ కేశినేని నాని అన్నారు. వెన్నుపోటు పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినని నాని అన్నారు. చంద్రబాబు నన్ను వద్దు అనుకున్న నేను వద్దు అనుకోవడం లేదని ఆయన అన్నారు. గతంలో నామినేషన్ల చివరి వరకు అభ్యర్థులను ప్రకటించేవారు కాదనీ అయితే నా విషయంలో చంద్రబాబు ఇలా నిర్ణయం తీసుకు న్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇండిపెండెంట్ గా పోటీ చేసిన నేను గెలుస్తానని గతంలోనే నేను చెప్పానని నేను ఏమి చేయాలో కాలమే నిర్ణయిస్తుంది కేశినేని నాని తెలిపారు. విజయవాడ ఎంపీ టికెట్ ఈసారి కేశినేని నాని కి కేటాయించడం లేదని అధిష్టానం నుంచి ప్రకటన రావడంతో నాని అంతర్మధనంలో పడ్డట్లు తెలుస్తోంది. విజయవాడలో కేశినేని చిన్ని కి నాని కి మధ్య గత రెండు రోజుల నుంచి వివాదం నడుస్తుంది.
ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య గొడవలు సద్దుమ నగాలన్న ఉద్దేశంతో చిన్నికి మద్దతు ప్రకటిస్తూ సభ ఏర్పాట్లను ఇతర కార్యక్ర మాలను నిర్వహిం చాలని టిడిపి అధిష్టానం చెప్పడంతో గొడవలకు తెరపడినట్లు అయింది. మొత్తం మీద కేశినేని నాని ఇప్పటివరకు టిడిపిలో తిరుగులేని నేతగా ఉన్నా రు. అయితే తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా లేక ఇతర పార్టీలోకి వెళ్తారా అన్నది తేలాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిఉంది.