- పేదలకు ఇది గుడ్ న్యూస్

Arogya Shree : పేదలకు మంచి చేసేలా ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య సేవలు బంద్ చేసేందుకు ప్రైవేట్ దవాఖానలు నిర్ణయం తీసుకోబోతున్నారనే సమాచారం మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సేవలు బందవుతాయని ఇప్పటికే ప్రైవేట్ దవాఖానల అసోసియేషన్ ప్రకటించింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం పేదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఈ సేవలు కొనసాగేలా ఏర్పాట్లు చేసింది.
ఏపీలో ప్రైవేట్ దవాఖానలకు ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద సుమారు రెండు వేల కోట్లు బకాయి పడినట్లు సమాచారం. అయితే పలు మార్లు దవాఖానల యాజమాన్యాలు ప్రభుత్వానికి విన్నవించినా ఇప్పటివరకు స్పందించలేదు. తమకు బకాయిలు చెల్లించకుంటే గురువారం నుంచి సేవలు బంద్ చేయబోతున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న బిల్లులు రాకపోతే తమ దవాఖానలు దివాళా తీసే పరిస్థితికి వచ్చిందని యాజమాన్యాలు తెలిపాయి. తమ ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే సేవలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 19 నుంచి సేవలు బంద్ అని వారి అసోసియేషన్ పేరిట ఒక ప్రకటన విడుదలైంది.
దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. బుధవారం రూ. 368 కోట్లు విడుదల చేసింది. దీంతో గత 15 రోజుల్లో మొత్తం సుమారు రూ. 774 కోట్లు విడుదల చేసింది. దీంతో సేవలను కొనసాగించనున్నట్లు ఏపీలో సూపర్ స్పెషాలిటీ దవాఖానల సమాఖ్య ప్రకటించింది. ఇకపై సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని చెప్పారు. మొదట ఆరోగ్య శ్రీ ట్రస్ట్ తో అసోసియేషన్ సమావేశమై కీలక చర్చలు జరిపింది. మిగతా బిల్లులను కూడా అతి త్వరలోనే చెల్లించేందుకు ప్రభుత్వంహామీ ఇచ్చిందని పేర్కొన్నారు.