
ఏది ఏమైనా ఆంధ్రా అధికారిని మాత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ వదిలేలా కనిపించడం లేదు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆంధ్రా ప్రాంతానికి బదిలీ అయిన సోమేశ్ కుమార్ అక్కడి స్వచ్ఛంద విమరణ పెట్టి మరీ ఇక్కడ సీఎం ముఖ్య సలహాదారుడిగా చేరారు. అయితే సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా నియమించినట్లు తెలిసింది. దాదాపుగా నిర్ణయం కూడా ఖరారైంది. ప్రభుత్వం అఫీషియల్ గా ఉత్తర్వులు జారీ చేయడమే మిగిలింది.
అయితే కొంత కాలంగా సోమేశ్ నియామకంపై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలో నియమించే ఛాన్స్ ఉందని, లేదా రెరా చైర్మన్ అయినా అప్పజెప్పవచ్చని, లేదటే ఎక్సైజ్ శాఖకు ప్రధాన కార్యదర్శిగా నియమించవచ్చన్నని ప్రభుత్వ వర్గాల నుంచి లీకులు వచ్చాయి. ఇవన్నీ ఊహాగానాలైనా ఆయన మాత్రం సీఎం ముఖ్య సలహాదరుడిగా రానున్నారు.
ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన Somesh Kumar తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రత్యూష్ సిన్హా కమిటీ కేటాయించిన సెంట్రల్ అడ్మినిస్టేటివ్ ట్రిబ్యునల్ ఉత్తర్వులతో 2022, డిసెంబర్ వరకూ తెలంగాణ ప్రాంతంలో కంటిన్యూ అయ్యారు. ఆయన తెలంగాణలో కొనసాగడంపై ప్రతిపక్షాలు చాలా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ కార్యక్రమాలలో సోమేశ్ కుమార్ ఎక్కువగా కలుగ జేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రతి పక్షాలు హైకోర్టులో ఒక పిటిషన్ వేశాయి. హై కోర్టు ఆయనను ఆంధ్రా కేడర్ లోకి వెళ్లాలని ఆదేశించింది. దీంతో ఆయన సంక్రాంతి-2023 ముందు ఆంధ్ర ప్రదేశ్ లో చేరి స్వచ్ఛంద విరమణ పెట్టుకున్నారు. అయితే తెలంగాణ సీఎం ముఖ్య సలహాదారుడిగా రానున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రభుత్వ ముఖ్య సలహాదారుడిగా మాజీ సీఎస్ రాజీవ్ శర్మ కొనసాగుతున్నారు. అయితే ఈయన కూడా తెలంగాణ ప్రభుత్వానికి మొదటి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. విరమణ తర్వాత ప్రభుత్వ ముఖ్య సలహాదారుడిగా నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా పని చేసిన వీరిద్దరూ రిటైర్ అయినా కూడా తిరిగి ప్రభుత్వానికి, సీఎంకు ముఖ్య సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు.






