22.5 C
India
Tuesday, December 3, 2024
More

    Shameer Pate incident : శామీర్ పేట్ కాల్పుల విషయంలో కీలక అప్ డేట్.. అడ్డు తొలగించుకునేందుకేనా..?

    Date:

     

    Shameer Pate incident
    Shameer Pate incident

    Shameer Pate incident శామీర్ పేట సమీపంలోని ఓ విల్లా లో జరిగిన కాల్పుల ఘటన రాష్ర్టవ్యాప్తంగా సంచలనమైంది. తమ బంధానికి అడ్డు వస్తున్నాడని తన ప్రియురాలి భర్తపైనే గన్ తో కాల్పులు జరపడం మరింత వివాదాస్పదమైంది. ఈ ఘటనలో నిందితుడు మనోజ్ సినీ నటుడు కావడం మరింత చర్చనీయాంశమైంది.  ఇప్పుడు ఈ కాల్పుల ఘటనపై అసలు విషయాలు కూపీ లాగుతున్నారు. నిందితుడైన మనోజ్ కుమార్ నాయుడు.. అలియాస్ సూర్యతేజను అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు గన్ ఎక్కడిదనే విషయంపై ఆరా తీస్తున్నారు.

    ఏపీలో ని విశాఖ కు చెందిన సిద్దార్థ దాస్(49)కు  ఒడిశా రాష్ర్టం బరంపూర్ కు చెందిన స్మిత గ్రంథితో  20 ఏండ్ల క్రితం పెండ్లయ్యింది. వీరికి కొడుకు(17), కూతురు(13) ఉన్నారు. అయితే 2019లో దంపతులిద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే తానుండే ప్రాంతానికి సిద్దార్థ రాకూడదని స్మిత అనుమతి పొందింది. అయితే స్మిత కొంత కాలంగా మానసిక ఒత్తిడితో ఉన్న వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

    ఇద్దరు పిల్లలతో కలిసి ఓ ఇంట్లో ఉంటున్నది.  ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా రాజాం కు చెందిన మ నోజ్ తో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.  తాను కూడా స్మిత వద్ద కౌన్సెలింగ్ తీసుకునేందుకు వచ్చాడు. ఈ క్రమంలో ఇరువురు దగ్గరయ్యారు.  భర్తతో వేరుగా ఉంటున్న స్మిత 2020లో ప్రశాంత్ అనే వ్యక్తితో కన్సల్టెన్సీని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత అతడు పార్టనర్షిప్ కు గుడ్ బై చెప్పాడు.  ఇక ఆ తర్వాత మనోజ్ ను ఇందులో భాగస్వామిగా చేర్చుకుంది. వచ్చిన లాభాలతో ఇద్దరూ కలిసి 2021లో ఒక విల్లా శామీర్ పేట్ లో కొన్నారు. స్మిత ఇద్దరు పిల్లల పట్ల మనోజ్ దురుసుగా ప్రవర్తించాడు. స్మిత కొడుకు ఇంటర్ లో ఫెయిలయ్యాడని చితకబాదాడు.

    దీంతో ఆ బాలుడు బాలల సంరక్షణ కేంద్రాన్ని ఆశ్రయించాడు.  అయితే తన చెల్లిల్ని కూడా మనోజ్ వేధిస్తున్నాడని స్మిత కొడుకు తన ఫ్రెండ్స్ సహాయంతో తండ్రికి, సీడబ్ల్యూసీ మెంబర్స్ కి ఫిర్యాదు చేశాడు.ఈ క్రమంలోనే తన కూతురితో మాట్లాడేందుకు సిద్ధార్థ దాస్ విశాఖ నుంచి శనివారం ఉదయం శామీర్ పేట్ కు చేరుకున్నాడు. ఇదే అదనుగా భావించిన మనోజ్ సిద్ధార్థ అడ్డు తొలిగించుకోవాలని భావించాడు. తన స్నేహితుడు గతంలో బహూకరించిన గన్ తో సిద్ధార్థపై కాల్పులు జరిపాడు. అక్కడి నుంచి తప్పించుకున్న సిద్ధార్థ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల రంగ ప్రవేశంతో విషయం అంతా బయటకు వచ్చింది. మనోజ్ ను న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా రిమాండ్ విధించారు. మనోజ్ కు వైద్య పరీక్షల అనంతరం చర్లపల్లి కారాగారానికి తరలించారు.

    అయితే ఇక్కడ స్మిత తీరు కూడా వివాదాస్పదమవుతున్నది. భర్త నుంచి దూరంగా ఉంటున్న స్మిత తన పిల్లలను ప్రియుడు ఇబ్బంది పెడుతున్నా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది. కూతురికి ఇబ్బంది ఎదురైందని తెలుసుకొని వచ్చిన సిద్ధార్థపై తానే స్వయంగా కాల్పులు జరిపించడం పై స్థానికులు మండిపడుతున్నారు. ఈ విషయంలో పోలీసులు స్మితను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే తల్లితో ఉండేందుకు ఇప్పుడు పిల్లలిద్దరూ ఇష్టపడడం లేదని తెలుస్తున్నది.   ప్రియురాలి భర్తను అడ్డుతొలిగించుకోవాలని ప్రయత్నించిన మనోజ్ మాత్రం కటకటాల పాలయ్యాడు.

    Share post:

    More like this
    Related

    Nagababu vs Allu arjun : అల్లు అర్జున్ కు నాగబాబు వార్నింగ్

    Nagababu vs Allu arjun : మెగా బ్రదర్ , జనసేన...

    Sajjala Bhargava Reddy : సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంలో చుక్కెదురు..

    Sajjala Bhargava Reddy : వైఎస్ఆర్ సీపీ సోషల్‌ మీడియా మాజీ...

    Prabhas : ప్రభాస్ పక్కన హీరోయిన్.. జస్ట్ 20 లక్షలే.. మరో సినిమా చేయడానికి లేదు

    Prabhas Heroine : ప్రభాస్ ఇటీవల తన కొత్త సినిమా ఫౌజీని ప్రకటించిన...

    Shobhita Dhulipalla : నాగచైతన్యకు అందుకే పడిపోయా : శోభిత దూళిపాళ్ల

    Shobhita Dhulipalla : నాగచైతన్యలోని కూల్ అండ్ కామ్ నెస్ చూసే అతడి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related