
వయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత వరుస సినిమాలు, సిరీస్ లు చేస్తూ తన గుర్తింపును కాపాడుకుంటుంది. విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించి సమంత ఫస్ట్ లుక్ పోస్టర్ ను మైత్రీ మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా విడుదల చేశారు.
ఖుషి పోస్టర్ సమంత అదిరిపోయేలా కనిపిస్తుంది. ట్రెండీ వేర్ వేసుకుని హైహీల్స్ తో మెడలో లెదర్ బ్యాగ్, ఐడీ కార్డుతో ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ లా కనిపిస్తుంది. ఈ చిత్రంలోని సమంత అచ్చం తన డెబ్యూ మూవీ ‘ఏమాయ చేశావే’లో కనిపించినట్లే ఉంటుంది. కానీ ఇందులో చీరలో కనిపించిన సమంత, ఖుషిలో ట్రెండీ వేర్ లో కనిపించారు. మొత్తానికి సమంత ఫస్ట్ లుక్ పై చాలా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతుంది. ఈ డైరెక్టర్ తోనే సమంత-నాగచైతన్య కలిసి మజిలీలో నటించారు. ఈ చిత్రం మంచి హిట్ కొట్టింది. సమంతతో ఆయనకు ఇది రెండో చిత్రం.
సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ లో కనిపించనుంది. దర్శకులు డీకే అండ్ రాజ్ దీన్ని తీస్తుండగా, సమంతకు జోడీగా వరుణ్ ధామన్ నటిస్తున్నారు. ఇటీవల రెండు ఎపీసోడ్స్ కూడా ప్రైమ్ వేదికగా రిలీజ్ చేసింది యూనిట్. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు దర్శకులు. ఇందులో సమంత సెక్సీ సీన్స్ ఉండబోతాని ప్రచారం జరుగుతోంది. ఇక రీసెంట్ గా వచ్చిన ‘శాకుంతలం’ సమంత కెరీర్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. గుణ శేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. సినీ ఫిల్డ్ లో ఇవన్నీ వస్తుంటాయని, ఒక ప్రయత్నం చేశాం కానీ అది ప్రేక్షకులకు నచ్చలేదంటూ ఆమె ఒక సదర్భంలో ట్వీట్ చేశారు.






