Jailor : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన సినిమా జైలర్. తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చిరంజీవి భోళాశంకర్ విడుదలైనా దాని టాక్ అటు ఇటుగా ఉండటంతో జైలర్ దూసుకుపోతోంది. జైలర్ ఫస్ట్ హాఫ్ బాగుందని, సెంటిమెంట్ ఎమోషనల్ గా ఉందని అంటున్నారు. దీంతో ఇన్నాళ్లు సరైన హిట్ కోసం ఎదురు చూసిన తలైవాకు మంచి హిట్ లభించింది.
సినిమా సెకండ్ హాఫ్ బాగుందని ఇంకా కొందరు చెబుతున్నారు. జైలర్ క్రియేట్ చేస్తున్న దానికి అనిరుద్ సంగీతం కూడా ఒక కారణంగానే తెలుస్తోంది. స్టార్ సినిమాలకు సంగీతం అందించే అనిరుధ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. జైలర్ సినిమాకు అతడు ఇచ్చిన సంగీతమే అతడి ఉన్నతిని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో జైలర్ మంచి హిట్ అందుకోవడం గమనార్హం.
కమల్ హాసన్ హీరోగా వచ్చిన విక్రం సినిమాకు కూడా సంగీతం అందించాడు. అనిరుద్ అందించిన సంగీతం కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అయినట్లు చెబుతున్నారు. జైలర్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు కూడా ఖుషి అవుతున్నారు. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాకు కూడా అనిరుద్ సంగీతం అందిస్తుండటం విశేషం.
ఎన్టీఆర్ సూపర్ హిట్లతో దూసుకుపోతుండటంతో ఇప్పుడు అనిరుద్ సంగీతం కూడా ఆయనకు ప్లస్ పాయింట్ అవుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇదివరకే తెలుగు సినిమాలకు అనిరుద్ పనిచేసినా ఆశించిన విజయాలు అందుకోలేదు. ఇప్పుడు జైలర్ హిట్ కావడంతో దేవర కూడా మంచి హిట్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తి చేస్తున్నారు.