King of Kotha’ trailer : దుల్కర్ సల్మాన్ కొవిడ్ సమయంలో ఓటీటీని ఏలిన హీరో. అంతకు ముందు ‘మహానటి’ లాంటి సినిమాలో కూడా చేశాడు. ఆయన చేసిన ప్రతీ చిత్రం ఒక అద్భుతమనే చెప్పవచ్చు. మంచి కంటెంట్ ను ఎంచుకోవడంలో ఆయన ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటారు. ఆయన తర్వాతి చిత్రం ‘కింత్ ఆఫ్ కోథా’. దీనికి సంబంధించిన ట్రైలర్ ఈ రోజు (ఆగస్ట్ 10) రిలీజ్ కాగా భారీ వ్యూవ్స్ తో దూసుకుపోతోంది.
మాస్ ఎంటర్‌టైనర్‌గా
దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్న ఈ చిత్రం పూర్తి మాస్ ఎంటర్‌టైనర్. దుల్కర్ బాల్య మిత్రుడు అభిలాష్ జోషిలీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా చేస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది. ట్రైలర్‌లో ఏం ఉందంటే.. దుల్కర్ డబుల్ రోల్ లో కనిపిస్తారు. ‘రాజు చిన్నప్పటి కల ఏంటో తెలుసా సార్? వాళ్ల నాన్నలా పెద్ద రౌడీ అవ్వాలని అనేవాడు. అప్పుడు ‘కోథా’ రాజు చేతిలో ఉండేది. వాడిని దాన వీర శూరుడు అని అనేవారు’. ఈ డైలాగ్ తో ట్రైలర్‌లో దుల్కర్ నటన ఆకట్టుకునేలా కనిపిస్తుంది.
సినిమా మొత్తం ‘కోథా’ అనే ప్రాంతం చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. ఆ ప్రాంతాన్ని గతంలో రాజు (దుల్కర్)వాళ్ల పాలిస్తాడు. ఇప్పుడు ఆయన కూడా తన తండ్రిలా ఆ ప్రాంతాన్ని పాలించాలని అలా జరిగిందా? లేదా? అన్నది ఇక మూవీలోనే చూడాలి. అత్యంత వేగంతో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
(తెలుగు ఆడియో కోసం యూట్యూబ్ వీడియో సెట్టింగ్స్‌లో భాషను ఎంచుకోండి)