
Aadhaar:
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. డిజిటల్ లావాదేవీలు చేసే క్రమంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా మోసగాళ్ల చేతిలో చిక్కుతూనే ఉన్నారు. మనకు తెలియకుండానే లెక్కకు మిక్కిలి సిమ్ కార్డులు తీసుకుంటున్నాం. దీంతో మనకు నష్టాలే ఉంటాయి. కానీ కొందరు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో మనం తీసుకున్న సిమ్ కార్డులు పక్కన పడేస్తే ఆ నెంబర్ తో ఇంకొకరు తీసుకుని మన రహస్యాలు కనిపెట్టే ప్రమాదముంది. దీంతోనే మన ఖాతాల నుంచి డబ్బులు మాయం కావచ్చు.
విజయవాడకు చెందిన ఓ వ్యక్తి పేరు మీద 658 సిమ్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో టెలికాం శాఖ అధికారులు వాటిని బ్లాక్ చేశారు. అలా మనకు తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల మనకే నష్టం కలుగుతుంది. మన సీక్రెట్స్ తెలియడంతో నేరగాళ్లకు మనమే సాయం చేసినట్లు అవుతుంది. అందుకే మనం జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మన ఆధార్ కార్డుతో గరిష్టంగా 9 సిమ్ కార్డులు తీసుకునేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రత్యేక సందర్భాలు ఎక్కువ సిమ్ కార్డులు తీసుకోవాల్సి వచ్చినా రీ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తే ఇబ్బందులొస్తాయి. మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డులున్నాయో తెలుసుకుంటే జాగ్రత్తలు తీసుకోవచ్చు. మన ఆధార్ కార్డుతో ఎన్ని మొబైల్ నెంబర్లు ఉన్నాయో తెలుస్తుంది.
మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవాలంటే tafcop.dgtelecom. gov.in వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాలి. అందులో బ్లాక్ యువర్ లాస్ట్, స్టోలెన్ మొబైల్. నో యువర్ మొబైల్ కనెక్షన్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. రెండో ట్యాబ్ పై క్లిక్ చేస్తే వినియోగదారుడి 10 అంకెల నెంబర్ ను ఎంటర్ చేయాలి. తరువాత మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే ఆ యూజర్ పేరిట ఉన్న మొబైల్ నెంబర్ల సంఖ్య కనిపిస్తుంది. అందులో ఏ నెంబర్ మీద కాకపోయినా దాన్ని బ్లాక్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు.






