Alcohol : మందు బాబులకు అత్యంత ఎక్కువ ఇష్టమైనది ‘విస్కీ’. ఎందుకంటే దీని టేస్ట్ యూనిక్ గా ఉంటుంది. విస్కీలో ఎంత నీరు కలిపితే మేలు? ఎంత నీటితో తాగితే లివర్ పై ఎక్కువ వేట్ పడకుండా చూడచ్చు లాంటి వాటి గురించి తెలుసుకుందాం.
విస్కీలో నీళ్లు కలిపి తాగుతారు. మందు ఘాటును తగ్గించడంతో పాటు రుచిలో కూడా కొంత మార్పు వస్తుంది. పెగ్గు టేస్ట్ బాగుండేందుకు విస్కీలో ఎంత వాటర్ మిక్స్ చేయాలనేది చాలా మందికి తెలియదు. దీనికి సమాధానం కోసం శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం నిర్వహించారు.
వాషింగ్టన్, మిచిగావ్, ఒరెగావ్ స్టేట్ యూనివర్సిటీలకు చెందిన ఆహార శాస్త్రవేత్తల బృందం..2023లో విస్కీ, వాటర్ మిక్సింగ్‌పై స్టడీ చేశాయి. టేస్ట్, ఫ్లేవర్ మారకుండా ఉండాలంటే వాటర్ ఎంత కలపాలి, ఎప్పుడు టేస్ట్ పెరుగుతుందో తెలుసుకునేందుకు ఈ అధ్యయనం చేశారు.
ఈ పరిశోధనకు సంబంధించి ఫలితాలను ఫుడ్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ స్టడీలో అనుభవం ఉన్న విస్కీ టేస్టర్ల ప్యానెల్ కూడా భాగమైంది. వారు బోర్బన్, రై, సింగిల్ మాల్ట్, బ్లెండెడ్ స్కాచ్, ఐరిష్ విస్కీతో సహా 25 డిఫరెంట్ విస్కీల్లో వివిధ స్థాయిల్లో నీటిని మిక్స్ చేశారు.
ఈ పరీక్షలో 100 శాతం విస్కీ (నో వాటర్ మిక్స్ డ్, 90 శాతం విస్కీ+ 10 శాతం నీరు, 80 శాతం విస్కీ+20 శాతం నీరు, 70 శాతం విస్కీ+30 శాతం నీరు, 60 శాతం విస్కీ+40 శాతం నీరు, 50 శాతం విస్కీ+50 శాతం నీటి స్థాయిలున్నాయి. అధ్యయన ఫలితాల ప్రకారం.. 80 శాతం విస్కీ+20 శాతం నీటి నిష్పత్తిలో ఫ్లేవర్, టేస్ట్ మారలేదు.
80 శాతం విస్కీకి+20 శాతం నీరు కలిపితే చక్కగా కలిసిపోయాయి. ఇలా చేయడం వల్ల నీటితో కలిసిపోని నాన్-హైడ్రోఫిలిక్ మాలిక్యూల్స్ దూరంగా నెట్టి.. బ్యాలెన్స్‌డ్ టేస్ట్ వస్తుంది. 80 శాతం విస్కీ+20 శాతం నీరు బెస్ట్ మిక్స్ రేషియోగా నిలిచింది.
20 శాతం కంటే ఎక్కువ నీరు మిక్స్ చేస్తే విస్కీలో రుచులు కోల్పోయాయి. దీనికన్నా తక్కువ శాతం నీరు విస్కీ ఘాటును తగ్గించలేదు. అందువల్ల 90 శాతం, ఆపైన వాటర్ మిక్స్ డ్ విస్కీలు బెస్ట్ మిక్సెస్ కాలేకపోయాయి. పరిశోధకులు ప్రాక్టికల్ వరల్డ్‌లో మందుబాబుల కోసం బెస్ట్ మిక్స్ తెలిపారు.
ఈ లెక్కన స్టాండర్డ్ డబుల్ పెగ్ (60 ml విస్కీ)లో 12 ml కంటే ఎక్కువ నీటిని కలపవద్దు. 12 ml వాటర్ విస్కీ రుచిని కాపాడుతూనే.. ఫ్లేవర్‌ను సైతం మెయింటైన్ చేస్తుంది. ఎక్కువగా కలిపితే విస్కీ పలుచనవుతుంది టేస్ట్, ఫ్లేవర్ పోతుంది.
కొన్ని రకాల విస్కీలను నీరు ఎలా ప్రభావితం చేస్తుందో కూడా గుర్తించారు. స్మోకీ ఆరోమాతో పాపులర్ అయిన స్కాచ్ విస్కీలు ఎక్కువ నీరు కలిపినప్పుడు లైట్‌గా, ఫ్రూటీగా మారాయి. స్పైసీ, రిచ్ ఫ్లేవర్ ఉండే బోర్బన్ విస్కీలు ఎక్కువ నీరు కలిపితే ఓకినెస్, వనిల్లా ఆరోమాను కోల్పోయాయి.
గమనిక : మద్యపానం ఆరోగ్యానికి హానికరం..