
Reduce Diabetes : ఆధునిక కాలంలో మన అలవాట్లు గతి తప్పుతున్నాయి. జీవనశైలి ఇబ్బందులు తెస్తోంది. అయినా మనం మారడం లేదు. తినే ఆహారాలు సక్రమంగా ఉండటం లేదు. దీంతో మధుమేహం, రక్తపోటు వంటి రోగాలు వస్తున్నాయి. దీంతో వాటిని తగ్గించుకోవడానికి మందులు వాడాల్సి వస్తోంది. నిరంతరం మందులతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆహారాలు తినడం వల్ల మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.
బెండకాయలు
బెండకాయలు తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. వారంలో కనీసం రెండుసార్లు తినడం వల్ల షుగర్ నియంత్రణలోకి వస్తుంది. ఈ క్రమంలో బెండకాయతో మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజుకు రెండు బెండకాయలను కోసి నీళ్లలో వేసి తెల్లవారుజామున ఆ నీళ్లు తాగితే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందని చెబుతుంటారు.
మెంతులు
మెంతులు కూడా షుగర్ ను తగ్గిస్తాయి. రోజు ఓ చెంచా మెంతులు ఓ గ్లాసు నీటిలో మెంతులు వేసి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టి ఉదయం వాటిని తినడం వల్ల కూడా డయాబెటిస్ తగ్గుతుందని గుర్తించారు. మెంతులు కూడా షుగర్ ను తగ్గించేందుకు మంచి మందులా పనిచేస్తుందని పలు పరిశోధనల్లో గుర్తించారు దీంతో వీటిని తిని మన మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు.
వెల్లుల్లి
షుగర్ ను నియంత్రణలో ఉంచడంలో వెల్లుల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే కూరల్లో మనం విరివిగా వాడతాం. రోజు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ అవుతుందని గుర్తించారు. దీంతో వెల్లుల్లి తినడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీనికి షుగర్ పేషెంట్లు చొరవ తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క కూడా షుగర్ ను నియంత్రిస్తుంది. దీంతో దీన్ని రోజు రెండు మూడు చెక్కలు నమలడం ద్వారా మధుమేహం తగ్గుతుంది. షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో ఇది సాయపడుతుంది. అందుకే దాల్చిన చెక్క వినియోగం ఎంతో మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా దీన్ని నమలడం ద్వారా మన శరీరంలో షుగర్ ను అదుపు చేసుకోవచ్చు.