
Kohili Sensational Post : డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత జట్టు ఓటమి తర్వాత రోహిత్ సేనపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మ్యాచ్లో జట్టంతా సమష్టిగా చేతులెత్తేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో జట్టులో కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ అవుట్ అయిన విధానాన్ని కూడా క్రికెట్ ఇండియా అభిమానులు తప్పుపడుతున్నారు. కోహ్లీ అవుట్ అయిన తీరును మాజీ ఆటగాళ్లు, విరాట్ ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు.
అయితే కోహ్లీ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఫైనల్ నాలుగో రోజు మ్యాచ్ సందర్భంగా ‘ఒక్కోసారి అన్ని వదిలేయడం కూడా నేర్చుకోవాలి’ అంటూ పోస్ట్ చేసిన కోహ్లీ.. తాజాగా మరో కొటేషన్ తో ఇన్ స్టా లో పోస్ట్ పెట్టాడు. ఇందులో ఏముందంటే ‘మార్పును సరిగా అర్థం చేసుకోవాలంటే దానిలో దూకాలి దాంతోపాటు నడవాలి చివరకు ఆ మార్పుతో కలిసి డ్యాన్స్ చేయాలి‘ అని కొటేషన్ను కోహ్లీ పంచుకున్నారు
. కోహ్లీ ఈ పోస్ట్ ను ఎందుకు చేశారు అని కొందరు ఫ్యాన్స్ మదన పడుతున్నారు. మరికొందరు ఎగతాళి చేస్తున్నారు. ఇలా కీలక మ్యాచ్ ల్లో చేతులు ఎత్తేసి, నీతులు చెప్తూ బతికేస్తున్నాడని వ్యంగంగా కామెంట్లు పెడుతున్నారు. అయితే జట్టులో విభేదాల వల్లే కోహ్లీ ఇలాంటి పోస్ట్ పెట్టి ఉంటాడని మరికొందరు భావిస్తున్నారు. ఈ నెలలో ఆప్గాన్ తో సిరీస్ ఆడాలని అనుకున్నా, కొన్ని కారణాలతో రద్దయింది. ఇక వచ్చే నెలలో వెస్టిండీస్ సిరీస్ తో మళ్లీ మైదానంలోకి భారత జట్టు దిగనున్నది. ఈ విశ్రాంతి సమయంలో కోహ్లీ తన కుటుంబంతో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే కోహ్లీ హాలిడ్ లో కుటుంబంతో సరదాగా గడుపుతూనే ఇలాంటి పోస్ట్ పెట్టి, అభిమానుల బుర్రలకు పని చెబుతున్నాడు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
|
ReplyForward
|






