Kollywood Directors : జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గ్రహీత అల్లు అర్జున్ కు ఇటు టాలీవుడ్ లోనే కాకుండా, బాలీవుడ్ వరకు క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను చాలా మంది డైరెక్టర్లు సంప్రదిస్తున్నారు. ఆయన కూడా ఆచి తూచి ప్రాజెక్టులను ఎంచుకుంటున్నారు. పుష్ప: ది రూల్ ఇంకా షూటింగ్ లోనే ఉండగా.. ఇతర భాషల నుంచి ఆయనకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి.
ఇటీవల జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఆయనను కలిశాడంటూ వార్తలు వినిపించాయి. ఆయనతో పాటు చిరంజీవిని కూడా కలిశాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. నెల్సన్ ‘బీస్ట్’ డిజాస్టర్ సాధించినా.. జైలర్ మాత్రం భారీగా విజయం సొంతం చేసుకుంది. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా భారీగా వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో నెల్సన్ కన్ను టాలీవుడ్ పై పడింది. అయితే బన్నీతో ఇటీవల చర్చలు జరపగా ఆయనతో ప్రాజెక్ట్ ఒకే చేసేందుకు బన్నీ కూడా సిద్ధంగా ఉన్నాడని, కానీ పుష్ప: ది రూల్ ముగిసిన తర్వాతే అంటూ వాదనలు వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్-నెల్సన్ కాంబోపై భిన్నమైన వాదనలు ఉన్నాయి. కొందరు ఈ కాంబోపై ఎగ్జిట్ అవుతుంటే.. మరికొందరు ప్రారంభమయ్యే వరకు చూద్దాంలే అంటూ లైట్ తీసుకుంటున్నారు. దీనికి కారణాలు కూడా చెప్తున్నారు. బన్నీకి కోలీవుడ్ కు అస్సలు కలిసి రావడం లేదు. గతంలో కోలీవుడ్ డైరెక్టర్లతో చర్చలు జరిపినా ఆ ప్రాజెక్టులు మాత్రం ముందుకు వెళ్లలేదు. కోలివుడ్ డైరెక్టర్ లింగుస్వామితో కొన్నేళ్ల పాటు చర్చలు జరిపాడు. తీరా అనౌన్స్ చేసినా ప్రాజెక్ట్ మాత్రం కార్యరూపం దాల్చలేదు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే బన్నీతో లింగుస్వామి డిస్కెషన్ మొదలు పెట్టిన సమయంలో లింగుస్వామి ఫాంలోనే ఉన్నాడు.
ఇక ప్రాజెక్ట్ పట్టాలెక్కిద్దాం అనుకున్న సమయానికి లింగుస్వామి గాడి తప్పాడు. ఆ తర్వాత మరో డైరెక్టర్ మురుగదాస్ మంచి ఫాంలో ఉండగా అల్లు అర్జున్ తో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. ఆ తర్వాత మరో తమిళ డైరెక్టర్ విక్రమ్ కుమార్ తోనూ కొంత కాలం ట్రావెల్ చేసిన అల్లు తర్వాత హ్యాండిచ్చాడు. మధ్యలో విక్రమ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ అంటూ వార్తలు వినిపించినా అవి నిజమో.. అబద్ధమో తెలియలేదు.
టాలీవుడ్ లో కూడా వేణు శ్రీరామ్ తో ‘ఐకాన్’ అనౌన్స్ చేసిన తర్వాత అది కూడా అడ్రస్ లేకుండా పోయింది. ఇక కథల విషయంలో బన్నీ రాజీ పడడని, అందుకే ఒక పట్టాణ ఒప్పుకోడని టాక్ ఉంది. ఇది తన తండ్రి వద్ద నుంచి నేర్చుకున్నాడని, తన తండ్రి కూడా అందుకే ఇండస్ట్రీలో భారీ ప్రొడ్యూసర్ గా మారాడని టాక్ ఉంది. అయితే బన్నీ విషయంలో కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయినా బెస్ట్ అందించేందుకే ఆయన ఎప్పుడూ కృషి చేస్తారని తెలుస్తోంది.