
Nagababu MLC nomination : జనసేన నేత కొణిదల నాగబాబు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి వనితారాణికి అందజేశారు.
నాగబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు, జనసేన నేత కొణతాల రామకృష్ణ, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు, జనసేన అధికార ప్రతినిధి బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, “జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా నాగబాబు గెలుపు ఖాయమని, రాష్ట్రంలో కూటమి అభివృద్ధి సాధ్యమని” వ్యాఖ్యానించారు.
జనసేన నేత నాగబాబు మాట్లాడుతూ, “ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీగా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాను. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది” అని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే కోటా నుంచి నాగబాబు ఎమ్మెల్సీగా గెలుపొందడం ఖాయమని, త్వరలోనే రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.