Krishnashtami Pooja : శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు సూర్యోదయాని్ి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి. ఇంటిని శుభ్రం చేయాలి. అనంతరం గోపాలుడిని ఆహ్వానిస్తూ, ఇంటి బయట నుంచి లోపలి వరకు వరిపిండి నీళ్లతో పాదాల ముద్రలు వేయాలి. దేవుడి మందిరంలో ముగ్గు వేసి, అందంగా అలంకరించిన తర్వాత ఓ పీఠంపై ఎర్రటి వస్త్రం పరిచి దానిపై శ్రీకృష్ణుడి విగ్రహం ఉంచండి.
విగ్రహానికి పూలు, నెమలి ఈకలతో అందంగా అలంకరించి, దీపం, ధూపం, నైవేద్యం.. ఇలా షోడసోపచారాలతో ప్రారంభించాలి. పంచామృతాలతో, గంగాజలంతో శ్రీకృష్ణుడికి అభిషేకం చేసి, నూతన వస్త్రాలు ధరింపచేయాలి. అష్టగంధ, చందనం, అక్షతలతో తిలకం పెట్టాలి. వెన్న, పంచదార, పంచాద్య నైవేద్యాలు నివేదించాలి.
కృష్ణాష్టమి రోజు ఉపవాసం కానీ, అనారోగ్య కారణాలతో ఒకపూట భోజనం చేసినా కానీ.. వైష్ణవ ఆలయాలను సందర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం ఉంటుందంటారు పండితులు. జన్మాష్టమి రోజు బంగారంతో గానీ, వెండితో గానీ చంద్రుడిని తయారు చేయించి అర్ఘ్యమిస్తే కోర్కెలు తీరుతాయని భవిష్యత్ పురాణంలో ఉంది.