Kriti Sanon :కృతి సనన్.. ఈ బ్యూటీ గురించి అందరికి తెలుసు.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎన్నో ఏళ్లుగా రాణిస్తూ వస్తుంది. ఇక ఈమె పాన్ ఇండియన్ వ్యాప్తంగా కూడా ఫేమస్ అయ్యింది.. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు కృతి సనన్ పేరు ఈ మధ్య బాగా వినిపించింది. అందుకు కారణం ఆదిపురుష్.. ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఆదిపురుష్ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యింది.
కానీ ఈ సినిమా ఫెయిల్ అయ్యింది. ఈ సినిమాతో పాన్ ఇండియన్ వ్యాప్తంగా ఈమె అవకాశాలు అందుకోవాలని అనుకుంది.. కానీ ఈ సినిమా దారుణంగా నిరాశ పరచడంతో మళ్ళీ బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. గతంలో మహేష్ బాబుతో చేసిన వన్ నేనొక్కిడినే కూడా ఇలాగె ప్లాప్ అవ్వడంతో ఇన్నేళ్లు టాలీవుడ్ లో కనిపించలేదు.

ఇక ఇప్పుడు ఎన్నో ఆశలతో చేసిన ఆదిపురుష్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. సౌత్ లో పాగా వేసి స్టార్ హీరోలందరితో నటించాలి అనుకున్నప్పుడల్లా ఈమెకు చేదు అనుభవమే ఎదురవుతుంది. ఇది పక్కన పెడితే ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ తో టచ్ లో ఉంటుంది.
వీలున్నప్పుడల్లా ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. క్రీమ్ కలర్ డిజైనర్ లెహంగాలో అమ్మడు గ్లామర్ తో రెచ్చిపోయింది. నడుము అందాలను చూపిస్తూ మతి పోగొట్టేస్తుంది.. అంతా ఈ అమ్మడి అందాలకు నోరెళ్ళ బెడుతున్నారు.






