Kriti Sanon :బీటౌన్ స్టన్నింగ్ బ్యూటీ కృతి సనన్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు.ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతి కాలంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రితి ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా అవతరించింది. అంతేకాకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో తన నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది ఈ పొడుగు కాళ్ల సుందరి.
మొన్నటివరకు ఇండస్ట్రీలో పొడుగు కాళ్ల సుందరిగా పేరు సంపాదించుకున్న దీపిక పడుకొనెను సైతం తన నటనతో వెనెక్కి నెట్టేసింది ఈ ముద్దుగుమ్మ.’హీరోపంతి’ మూవీతో హిందీలో ఆరంగేట్రం చేసిన క్రితి ఆ సినిమా విజయం సాధించడంతో వరుసగా మూవీస్ చేస్తూ ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకుంది.
కేవలం గ్లామర్ పాత్రలతోనే ఆగిపోకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లోనూ ఈ అమ్మడు పలు సినిమాలు చేసింది.గతేదాడి వచ్చిన ‘మీమీ’ చిత్రంలో సరోగసీ ద్వారా బిడ్డకు జన్మినిచ్చే పాత్రను అద్భుతంగా పోషించింది.అందులో ఆమె నటనకు గాను కేంద్రం ఇటీవల జాతీయ ఉత్తమ నటిగా కృతిసనన్ పేరును ప్రకటించింది.
రీసెంట్‌గా గద్దర్ మూవీ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న క్రితిసనన్ డార్క్ బ్లూ ఔట్‌ఫిట్‌తో తళుక్కుమని మెరిసింది.స్టేజీమీద ఈ బ్యూటీ తన ఎద అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారు మతులు పోగొడుతొంది.కృతిసనన్ అందానికి, నటనకు చాలా మంది అభిమానులు ఉన్నారు.మొన్నటివరకు లవ్ ఓరియెంటెడ్ మూవీస్ చేసిన ఈ అందాల ముద్దుగుమ్మ.. ఈ మధ్యకాలంలో యాక్షన్ అండ్ లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు కూడా ప్రాధాన్యం ఇస్తోంది.






