
Kriti Shetty surgery : ఉప్పెన సినిమాతో తెలుగులో ఉప్పెన సృష్టించిన బ్యూటీ ఎవరు అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు.. ఆమె ఎవరో తెలిసిందిగా.. కృతి శెట్టి.. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్మరణీయమైన స్థానం ఎంచుకుంది.. ఒక్క సినిమా తోనే ఈమె మంచి హిట్ అందుకుంది.. ఈ సినిమాలో ఈమె నటన, హావభావాలు అన్ని కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి.. దీంతో వరుస ఆఫర్స్ వరించాయి..
మొదట్లో అన్ని సూపర్ హిట్స్ నే అందుకుంటూ యంగ్ హీరోలకు మంచి ఛాయిస్ గా నిలిచింది. అయితే ఈ మధ్య ఈమె నటించిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి.. దీంతో ఈమె కెరీర్ కాస్త జోరు తగ్గింది అనే చెప్పాలి.. ఏ సినిమా చేసిన మొదట్లో ఎలా హిట్ అయ్యిందో ఇప్పుడు అలా ప్లాప్ అవుతుంది.. దీంతో ఈమె కెరీర్ పూర్తిగా డీలా పడిపోయింది.
ఇటీవలే నాగ చైతన్యతో చేసిన కస్టడీ సినిమా కూడా అమ్మడి అంచనాలను నిలబెట్టలేక పోయింది. ఇది కూడా ప్లాప్ అయ్యింది. దీంతో ఈమెకు మరో ఆఫర్ లేదు.. అందుకే గ్లామర్ డోస్ కాస్త పెంచేసి సోషల్ మాధ్యమాల్లో ఫోటో షూట్స్ షేర్ చేస్తుంది.. ఇదిలా ఉండగా ఈమె తన బాడీలో ఒక పార్ట్ కు సర్జరీ చేయించుకుంది అని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి..
దీంతో ఈ వార్తలపై కృతి శెట్టి స్పందించింది.. ఇలాంటి వార్తలు ఎవరు.. ఎందుకు రాస్తారో తెలియదు.. వీటిని విన్నప్పుడు బాధగా ఉంటుంది.. ఉప్పెన సినిమా సమయంలో ఉన్నట్టు ఇప్పుడు లేకపోతే ప్లాస్టిక్ సర్జరీ చేయించు కున్నట్టేనా.. ఒకేలా మనిషి ఎప్పుడు ఉండదు కదా.. మేకప్, హెయిర్ స్టైల్ వల్ల కూడా మారవచ్చు అని అన్నారు..