38.5 C
India
Thursday, March 28, 2024
More

    KTR unhappy : 2026 డీలిమిటేషన్ పై కేటీఆర్ అసంతృప్తి

    Date:

    KTR unhappy
    KTR unhappy

    KTR unhappy : 2026 తర్వాత జరగనున్న లోక్‌సభ స్థానాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. డీలిమిటేషన్‌పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.  అధిక జనంతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు నియంత్రణ పద్ధతులు పాటించాలని దశాబ్దాల నుంచి కేంద్రం చెబుతున్న మాటలను నమ్మినందుకు దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు నష్టపోయే పరిస్థితి దాపురించిందని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాల్లో  లోక్‌సభ స్థానాలు తగ్గనుండడంపై ఆవేదన వెలిబుచ్చారు.

    జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాలు లోక్‌సభ సీట్ల పెంపుతో లబ్ధి పొందుతాయని.. ఈ ధోరణి దురదృష్టకరమని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ అంశంపై మంగళవారం మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘జనాభా నియంత్రణ విధానాలు పాటించిన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ ఈ రోజు శిక్షకు గురవుతున్నాయి. అన్ని రకాల మానవాభివృద్ధి సూచీల్లోనూ దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. కేవలం 18 శాతం జనాభా కలిగిన ఈ రాష్ట్రాలు 35% స్థూల జాతీయోత్పత్తికి నిధులు అందిస్తున్నాయి.

    జాతీయ ఆర్థిక అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు.. అసంబద్ధమైన పునర్విభజన విధానంతో  భవిష్యత్తులో ప్రాధాన్యాన్ని కోల్పోకూడదు. ప్రగతిశీల విధానాలను అమలుపరుస్తున్నందుకు లబ్ధిపొందాల్సిన చోట.. తీవ్ర అన్యాయానికి గురవుతున్న దక్షిణాది రాష్ట్రాలు గొంతెత్తాల్సిన అవసరం ఉంది. జరుగుతున్న అన్యాయంపై రాజకీయాలకు అతీతంగా దక్షిణాది నాయకులు, ప్రజలు గళమెత్తాలి’’ అని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

    వీళ్లు సంస్కారం లేని మూర్ఖులు : ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌

    ‘రేపిస్టులను సత్కరించేవారు.. హంతకులను స్వాగతించేవారు.. మహాత్మాగాంధీని హేళన చేసేవారు.. పరీక్ష పత్రాలను లీక్‌ చేసి, యువత జీవితాలతో ఆడుకునేవారు.. మన క్రీడా విజేతలను అవమానించేవారు.. వీరంతా సంస్కారం లేని మూర్ఖులు’ అంటూ మంత్రి కేటీఆర్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీని రక్షించడానికి కేంద్రం ఎందుకు ఆరాటపడుతున్నదని ప్రశ్నించారు. ‘‘ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీకి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా రక్షణ కల్పిస్తున్నారని, ఛాంపియన్లు, రెజర్లు మాత్రం తమ ఒలింపిక్‌ పతకాలను గంగా నదిలో విసర్జించాల్సి రావడం అవమానకరం?’’ అని కేటీఆర్‌ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    Punjab CM : 50 ఏళ్ల వయసులో తండ్రి అయిన పంజాబ్ ముఖ్యమంత్రి..

    Punjab CM : పంజాబ్ సీఎం భగవoత్  సింగ్ మాన్ 50...

    Chandrababu : సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు 7 ప్రశ్నలు..

    Chandrababu : 90 శాతం హామీలు నెరవేర్చమని చెప్పుకునే సీఎం జగన్మోహన్...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth Reddy : లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సిద్దమైన సీఎం రేవంత్‌ రెడ్డి

        తెలంగాణ: లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో  కాంగ్రెస్‌ తరఫున ప్రచారానికి సీఎం...

    Women’s Reservation Bill : మహిళా బిల్లు.. ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం

    Women's Reservation Bill : అతివను అందలం ఎక్కించేలా మహిళాబిల్లు పెట్టాలని ఎన్నో...

    New and old parliament : కొత్త, పాత పార్లమెంటు భవనాల గురించి తెలుసా మీకు..!

    New and old parliament : కొత్త పార్లమెంట్ భవనం: దేశ రాజధాని...

    నా ఇల్లు ఖాళీ చేస్తున్నా : రాహుల్ గాంధీ

    లోక్ సభ సభ్యుడిగా నాకు కేటాయించిన ఇంటిని ఖాళీ చేస్తున్నానని లోక్...