Kuwait NRI : చంద్రబాబు అరెస్టు విదేశాల్లోనూ ప్రకంపనలు కలిగిస్తోంది. బాబుకు మద్దతుగా నిలుస్తున్నారు. అక్రమ అరెస్టును ఖండిస్తున్నారు. నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నిర్వాకాన్ని తప్పుబడుతున్నారు. మచ్చలేని నాయకుడిని జైల్లో వేయడం ఏమిటని మండిపడుతున్నారు. లక్షలాది మంది విద్యార్థులకు ఉపాధి చూపిన మార్గదర్శిని జైల్లో పెట్టడం నేరమని ప్రశ్నిస్తున్నారు.
విదేశాల్లో ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కువైట్ లోనూ నిరసన తగిలింది. సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్టును తప్పుబడుతున్నారు. వైసీపీ తీరును ఎండగడుతున్నారు. దీనికి ఫలితం అనుభవిస్తారని అంటున్నారు. భవిష్యత్ లో వైసీపీకి తగు రీతిలో బుద్ధి చెబుతామని నినదిస్తున్నారు.
సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా తయారు చేసిన బాబును జైల్లో బంధించడమేమిటి? అన్నం పెట్టిన వాడికే సున్నం పెట్టడం ఏమిటని అడుగుతున్నారు. వైసీపీ నేతలే దొంగలు, దోపిడిదారులుగా అవతారమెత్తుతూ నీతి నిజాయితీగల బాబును లోపల వేయడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. బాబుకు మేమంతా సంఘీభావం తెలుపుతున్నామని ప్రకటించారు.
చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికం. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేయడం అనైతికం. వారికి ఎవరిచ్చారు ఈ అధికారం. మచ్చ లేని నాయకుడిని దురుద్దేశపూర్వకంగా లోపల వేయడం అన్యాయమని నినదిస్తున్నారు. విజన్ కలిగిన నేతలను కావాలనే కుట్రలో భాగంగా ఇలా బలి చేయడం తగదని హితవు పలుకుతున్నారు. దీనికి అంతకంతకు బదులు తీర్చుకుంటామని వెల్లడిస్తున్నారు.