33.2 C
India
Monday, February 26, 2024
More

    Lal Bahadur Sastry : లాల్ బహదూర్ శాస్త్రి గొప్పతనానికి ప్రతీక

    Date:

    Lal Bahadur Sastry
    Lal Bahadur Sastry

    Lal Bahadur Sastry : ఆయన దేశానికి రెండో ప్రధానిగా చేసిన వ్యక్తి. అత్యంత సాధారణ జీవితం గడిపిన మహానుభావుడు. సాధారణ జీవితమే అతడికి ఇష్టం. అందుకే గొప్పలకు పోకుండా నిరాడంబరంగా ఉండేందుకు నిర్ణయించుకునేవాడు. తాను ప్రధాని గా ఉన్నా తన పని తానే చేసుకునే వాడు. గాంధీ పుట్టిన నాడే ఆయన జన్మించినా అందరు గాంధీ జయంతి జరుపుకుంటారు. కానీ ఎక్కడ లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని జరిపిన దాఖలాలు కనిపించవు.

    1904లో వారణాసిలో జన్మించారు. 1966 జనవరి 11న తాష్కెంట్ లో మరణించారు. అధికారంలో ఉండగా జీతం కూడా తీసుకునేవాడు కాదు. ఆ సమయంలోనే వారి ఇంటి పని మనిషి రాకపోవడంతో తన పనులు తానే చేసుకునేవారట. సాధారణ జీవితాన్ని ఇష్టపడేవారు. తన కోటు కింద చిరిగిన కుర్తా ధరించేవాడు. అంతటి సాధారణ జీవితం ఆయన సొంతం.

    ఓసారి టెక్ట్ టైల్ మిల్లు చూసేందుకు వెళితే దాని యజమాని శాస్త్రికి పలు విలువైన చీరలు చూపించాడు. అంత ధర పెట్టి తాను కొనలేనని తక్కువ ధర చీరలు చూపించసాగాడు. మీకు ఏది కావాలన్నా తీసుకోండి. దానికి ధర చెల్లించాల్సిన అవసరం లేదని సూచించాడు. కానీ నేను నా భార్యకు ఖరీదైన చీర ఇవ్వలేను. తక్కువ ధర చీర అయితేనే తీసుకుంటానని తెగేసి చెప్పడంతో మిల్లు జయమాని ఖంగుతిన్నాడట. శాస్త్రి సింప్లిసిటీకి అందరు ఆశ్చర్యపోయారట.

    తాను రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఓ రైలు ప్రమాదం జరిగితే దానికి బాధ్యత నాదే అని తన పదవికి రాజీనామా చేశారు. అలా విలువలకు ప్రాణమిచ్చే నేతగా ఆయన ఎప్పుడు ప్రజల గుండెల్లోనే గూడు కట్టుకున్నాడు. కానీ మహాత్మా గాంధీకి ఉన్న స్థానం లాల్ బహదూర్ శాస్త్రికి ఇవ్వకపోవడం శోచనీయం. విలువలు కలిగిన నేతల్లో శాస్త్రి ప్రత్యేక శైలి.

    Share post:

    More like this
    Related

    Anant Ambani Wedding : అంబానీ ఇంట పెళ్లి మరీ..ఆ మాత్రం ఉండాల్సిందే!

      Anant Ambani Wedding : భారత సంపన్నుడు, రిలయన్స్ అధిపతి ముఖేశ్...

    Srutanjay Narayanan IAS : తండ్రి స్టార్ కమెడియన్.. కొడుకు ఐఏఎస్.. కోచింగ్ తీసుకోకుండానే 75వ ర్యాంక్

    Srutanjay Narayanan IAS : తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటారో అదే...

    Sameera Reddy : అప్పట్లో సైజ్ పెంచమని తెగ ఇబ్బంది పెట్టేవారు.. సమీరా రెడ్డి హాట్ కామెంట్స్

    Sameera Reddy : తెలుగు ఇండస్ట్రీపై అందం, అభినయంతో ఎంతో మంది...

    India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

    India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related