30.9 C
India
Saturday, May 17, 2025
More

    YCP Pulivendula : 2 కోట్ల విలువ చేయని భూమిని పన్నెండున్నర కోట్లకు కొనేలా చేశారు..పులివెందులలో వైసీపీ లీలలు

    Date:

    YCP Pulivendula
    YCP Pulivendula

    YCP Pulivendula : అధికారం చేతిలో ఉంది కదా అని వైసీపీ నేతలు రెచ్చిపోయారు. అందినకాడికి దోచుకున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వారి ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతుంది.  పులివెందులలో అవినాష్ రెడ్డి బావ, వైసీపీ లీడర్ ఓ వెంచర్ వేసి భవనం నిర్మిస్తున్నారు. అది ఎకరన్నర స్థలంలో ఉంటుంది. గట్టిగా అయితే స్థలం విలువతో పాటు వేసిన పిల్లర్లు, శ్లాబ్ ఖర్చు రెండు కోట్లు కూడా చేయదు. ఇంకా చెప్పాలంటే ఆ ఏరియాలో అసలు కొనేవాళ్లు కాదు కదా.. అద్దెకు వచ్చే వాళ్లు కూడా ఉండరు. ఆ విషయం వారికీ తెలుసు. కానీ కొనేందుకు మన ప్రభుత్వం ఉంది కదా అని రంగంలోకి దిగారు.

    వెంటనే కలెక్టర్ పులివెందులలో పర్యాటకుల కోసం అద్భుతమైన ఫోర్ స్టార్ హోటల్ కట్టేందుకు సగం కట్టిన భవనం రెండున్నర ఎకరాల్లో ఉంది కొనాలని టూరిజం శాఖకు రిక్వెస్ట్ పెట్టారు. వాస్తవానికి పులివెందులకు పర్యాటకులు ఒక్కరూ రారు. అయినా వెంటనే కొనాలని సీఎంవో నుంచి ఒత్తిళ్లు రావడంతో… టూరిజం అధికారులు ఏకంగా పన్నెండున్నర కోట్లు పెట్టి కొనేశారు. ఈ దెబ్బతో ప్రజాధనం పది కోట్లకుపైగా అవినాష్ రెడ్డి బావ ఖాతాలో పడింది. విచిత్రం ఏమిటంటే… అక్కడ ఆ భవనం ఉంది ఎకరన్నర స్థలంలో అయితే కలెక్టర్ రెండున్నర ఎకరాల్లో ఉందని కొనుగోలు చేయాలని చెప్పడం. అయితే కొనుగోలు సమయంలో అంత స్థలం లేకపోవడంతో ఉన్న స్థలాన్నే అదే డబ్బులతో కొనేశారు.

    దీనిని బట్టి అర్థం అవుతుంది.. ప్రజాధనాన్ని ఎంత ఈజీగా కోట్లకు కోట్లు ఎలా కొట్టేశారో.. ఇది విన్న ప్రజలు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రజలు పన్నులరూపంలో కట్టే సొమ్మును సొంత ఖాతాలకు ఇంత అడ్డగోలుగా మల్చుకున్నారంటే.. పోను పోను బయటపడేవి ఇంకెంత ఘోరంగా ఉంటాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే ఇక ఖజానా అంతా మా సొత్తే అన్న చందంగా వ్యవహరించిన వారికి మరోసారి ఎవరూ అలా చేయని విధంగా ట్రీట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    IPL: ప్లే ఆఫ్స్ రేస్.. ఏ జట్టు ఎన్ని గెలవాలంటే!

    IPL 2025 : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన...

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Amar Deep : నా లవర్ ని నా కళ్ళ ముందే… ఎట్టకేలకు ఆ రహస్యం బయటపెట్టిన బిగ్ బాస్ అమర్ దీప్!

    Amar Deep : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తో పాప్యులర్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Keshineni : విజయవాడలో కేశినేని సోదరుల పంజా.. మధ్యలో కొలికపూడి!

    Keshineni : విజయవాడ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కేశినేని సోదరుల మధ్య జరుగుతున్న...

    Bharati Cements : ఆ ఒక్కడు దొరికితే భారతి సిమెంట్స్ సీజ్ ?

    Bharati Cements : గోవిందప్ప బాలాజీ భారతి సిమెంట్స్ ఆర్థిక వ్యవహారాలు, వైఎస్...

    Ganta Srinivas : విశాఖ నుంచి అమరావతికి హైదరాబాద్ మీదుగా రావాలా?: గంటా ఆవేదన

    Ganta Srinivas : విశాఖపట్నం, ఏప్రిల్ 16: విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన...

    16th Finance Commission : ఏపీకి ఎన్ని నిధులొస్తాయి.. 16వ ఆర్థిక సంఘం కీలక పర్యటన

    16th Finance Commission : ఆంధ్రప్రదేశ్‌లో 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు ఏప్రిల్...