21 C
India
Sunday, February 25, 2024
More

  Actress Kavya : భాష ముఖ్యం కాదు బతుకే ముఖ్యం.. బ్రహ్మముడి నటి కావ్య ఆసక్తికర వ్యాఖ్యలు

  Date:

  Brahmamudi actress Kavya interesting comments..
  Brahmamudi actress Kavya interesting comments..

  Actress Kavya : ఇటీవల భాష భలే క్రేజీగా మారుతోంది. సొంత భాషలో ఎన్నోఅవకాశాలున్నాయంటారు. కానీ ఆంగ్లం నేర్చుకోవాలంటుంటారు. ఇంగ్లిష్ మాట్లాడటం అందరికి సాధ్యం కాదు. అందులో పొరపాట్లు ఉంటే నవ్వుకుంటారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆంగ్లంపై విమర్శలు వచ్చాయి. కానీ అదేమైన మన సొంత భాషనా? కిరాయి భాష ఎలా మాట్లాడినా ఓకే అని సర్దుకోవాలి.

  ప్రస్తుతం సాఫ్ట్ వేర్లు అంత ఇంగ్లిష్ లోనే మాట్లాడతారు. వారికి ఆంగ్లంపై పట్టు ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి. లేదంటే రావు. అందుకే ఇప్పుడు అందరు తెలుగు కాదని ఆంగ్ల మాధ్యమానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత భాష కిరాయి భాషగా మారుతోంది. రానురాను అందరు అమ్మానాన్నకు బదులు మమ్మీ డాడా అని పిలుస్తారని సర్వేలు చెబుతున్నాయి.

  ఇప్పుడు సీరియళ్లకు భలే డిమాండ్ ఉంది. అందులో నటించే వారికి కూడా గుర్తింపు లభిస్తుంది. బ్రహ్మముడి సీరియల్ ద్వారా కావ్య మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఎలక్ర్టానిక్స్ అండు కమ్యూనికేషన్ లో ఇంజినీరింగ్ చేసిన ఇంగ్లిష్ లో ప్రావీణ్యం సంపాదించలేకపోయింది. కానీ సీరియల్ లో మాత్రం మంచి పట్టు సంపాదించి దూసుకుపోతోంది. తెలుగులో మంచినటిగా వెలుగుతోంది.

  ఇటీవల తనకు ఇంగ్లిష్ రాదని కుండబద్దలు కొట్టింది. తమిళ మాధ్యమంలో చదవడం వల్ల ఇంగ్లిష్ పెద్దగా రాదని చెప్పేసింది. ఆంగ్లం సరిగా రాకపోవడంతో ఇంజినీరింగ్ చదివినా సాఫ్ట్ వేర్ కాలేకపోయానని తన మనసులోని మాట వెల్లడించింది. ఇంగ్లిష్ రావాలని ఏముంది? ఇంగ్లిష్ రాకపోతే బతకలేమా? ఇంగ్లిషే మాట్లాడాలా? అని ప్రశ్నించింది. టాలెంట్ ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని తెలిపింది. అందరు ఆంగ్లం వెంట పడుతున్నారని ఆక్రోశం వెల్లగక్కింది.

  Share post:

  More like this
  Related

  TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

  TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

  Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

  Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

  SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

  SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

  Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

  Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related