Chiranjeevi Largest Cutout :వాల్తేరు వీరయ్య సినిమా రూ. 200 కోట్లు వసూలు చేయడం గమనార్హం. ఇప్పుడు భోళా శంకర్ సినిమాతో ఆగస్టు 11న రానున్నాడు. దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా సూర్యపేటలో భారీ కటౌట్ ఏర్పాటు చేయడంతో సినిమా గురించి ప్రచారం బాగానే చేస్తున్నారు. ఈ మేరకు మూవీ మేకర్స్ ఆధ్వర్యంలోనే కటౌట్ నిర్మించినట్లు తెలుస్తోంది. ఇది దేశంలోనే అతిపెద్ద కటౌట్ గా చెబుతున్నారు.
కుర్ర హీరోలతో పోటీ పడుతూ చిరు చిత్రాలు చేస్తున్నారు. గత ఏడాది ప్రారంభంలో గాడ్ ఫాదర్, ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య సినిమాలు చేసి విజేతగా నిలిచాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను రంజింపచేస్తోంది. చిరు డైలాగులకు ప్రేక్షకుల నుంచి స్పందన ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తమిళంలో విజయవంతమైన వేదాలం సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
సినిమాలో చిరుకు జంటగా తమన్నా నటిస్తోంది. చెల్లెలుగా కీర్తి సురేష్ మంచి పాత్ర పోషిస్తోంది. సుశాంత్ ఆమె భర్తగా కనిపించనున్నాడు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. తాజాగా సూర్యపేటలో సినిమా ప్రమోషన్లలో భాగంగా కటౌట్ ఏర్పాటు చేశారు. సూర్యపేటలో తోట రెస్టారెంట్లో 126 అడుగుల కటౌట్ పెట్టడంతో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. దీన్ని చూసిన అభిమానులు మంత్రముగ్ధులవుతున్నారు.






