Pawan Kalyan OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు. ప్రస్తుతం నెలలో ఆ నాలుగు సినిమాలకు ఒకదాని తర్వాత ఒకటికి తన టైం కేటాయిస్తూ పూర్తి చేస్తున్నారు. ఒప్పుకున్న చిత్రాలను త్వరితగతిన ఆయన పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు చిత్రాలు షూటింగ్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. వినోదయ సితం రీమేక్ కొంత మేర షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర నిడివి తక్కువ. సాయి ధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ కేవలం 20-25 రోజులు మాత్రమే కేటాయించారట.
దర్శకుడు హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు. ఇక హరిహర వీరమల్లు పెండింగ్ లో పడిపోయింది. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’ లైన్లో ఉంది. ఈ షెడ్యూల్ ను మహారాష్ట్రలో పూర్తి చేశాడు. మధ్యలో గ్యాప్ ఇచ్చాడు.
తాజాగా యువ దర్శకుడు సుజీత్‌తో OG షెడ్యూల్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ యాక్షన్ డ్రామా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తాజాగా పవన్ మరోసారి ‘ఓజీ’కి డేట్స్ ఇచ్చాడు. ఓజీ సెట్ లోకి అడుగుపెట్టిందని నిర్మాతలు తెలిపారు. స్టైల్, మాస్ , ఎనర్జీతో పవన్ ఎంట్రీ ఇస్తున్నట్టుగా ట్వీట్ చేసింది.
ఈసారి హైదరాబాద్ లోనే సెట్స్‌లో పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆయనతో పాటు మరికొందరికి సంబంధించిన కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు.
డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ బిగ్గీలో ప్రియాంక అరుల్ మోహన్ పవర్ స్టార్‌తో రొమాన్స్ చేసే అవకాశం ఉంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌తో అనూహ్యమైన హైప్‌ని సృష్టించిన ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు.
#OG enters the set… 🔥🔥🔥
An action-packed schedule is underway, filled with style, mass and energy. 🤟🏻#FireStormIsComing 🔥#TheyCallHimOG 💥 pic.twitter.com/O7m5RdSVOC
— DVV Entertainment (@DVVMovies) June 8, 2023






