
Lavanya Photo Shoot : ఇటీవలే హీరోయిన్ గా ఉన్న లావణ్య త్రిపాఠీ మెగా కుటుంబానికి కోడలుగా మారింది అనే విషయం తెలిసిందే.. మెగా కుటుంబంలో ఈమె రాకతో మరో కోడలు చేరిపోయింది.. వెండితెర పై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న లావణ్య ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తుంది.
అందాల రాక్షసిగా తెలుగు తెరపై అడుగు పెట్టి మొదటి సినిమా తోనే మంచి ఇంప్రెషన్ అందుకుంది. మరి ఈ బ్యూటీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో గత ఐదేళ్లుగా ప్రేమాయణం నడిపిస్తుంది.. సీక్రెట్ గా వీరి ప్రేమను కొనసాగించి ఆ తర్వాత పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.
ఇక వివాహ బంధంతో ఈ ప్రేమికులు జంటగా మారి ఇప్పుడిప్పుడే వివాహ బంధంలో ఉన్న గొప్పదనాన్ని ఆస్వాదిస్తున్నారు. నవంబర్ 1న పెళ్లి చేసుకున్న ఈ జంట ఆ తర్వాత ఇక్కడ లావణ్య సొంత ఊరిలో రెసెప్షన్స్ జరుపుకుని ఫుల్ గా ఎంజాయ్ చేసారు.. ఇలా వేడుకలు మొత్తం ముగించుకుని ఇప్పుడు ఈ జంట ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా పెళ్లి తర్వాత మొదటిసారి ట్రెడిషనల్ లో కాకుండా మోడరన్ డ్రే లో ఫోటో షూట్ చేసుకుని అందరిని అట్రాక్ట్ చేసింది ఈ బ్యూటీ.. తన భర్త వరుణ్ తేజ్ తో కలిసి ఫోటో షూట్ చేయించుకోగా వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి..
స్లీవ్ లెస్ బ్లాక్ డ్రెస్ లో అమ్మడి అందాలు కనువిందు చేస్తున్నాయి.. దీంతో ఈ ఫోటో షూట్ పై నెటిజెన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఇలాంటి ఫోటో షూట్ అవసరమా.. అందుకే విడాకులు అయ్యేది అంటూ కొందరు కామెంట్ చేస్తుంది సూపర్ వదినమ్మ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.