
Lavanya wall pic : వరణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం కావడంతో ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండటం లేదు. మెగా కుటుంబ కోడలిగా లావణ్య రానుండటంతో అభిమానుల్లో కూడా హర్షం వ్యక్తమవుతోంది. ఎప్పటికప్పుడు వారి ఫొటోలు షేర్ చేసుకుంటున్నారు. అభిమానులతో సరదాగా మాట్లాడుతున్నారు. దీంతో వీరి జంట కన్నులపండుగగా ఉందని చెబుతున్నారు.
తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన పిక్ ను చూసి మురిసిపోతున్నారు. లావణ్య వాల్ పిక్ ను చూసి వరణ్ కు తగ్గ జోడిగా అభివర్ణిస్తున్నారు. స్నేహితులతో కలిసి లావణ్య చేస్తున్న సందడి అభిమానుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. మై లవ్స్, డ్రీమ్ బిగ్గర్ అంటూ క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ గా నిలుస్తోంది. నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.
మిస్టర్ సినిమాతో కలిసి నటించిన వీరిద్దరు జీవిత భాగస్వాములుగా మారనుండటంతో అందరి కళ్లు ఈ జంటపైనే నిలుస్తున్నాయి. పెద్దల అంగీకారంతో వీరి నిశ్చితార్థం కావడంతో ఈ ఏడాదిలోనే వీరి వివాహం జరగనున్నట్లు చెబుతున్నారు. లావణ్య ఇప్పటికే పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు పూర్తి చేసిన తరువాతే వివాహం ఉంటుందని తెలుస్తోంది.
మెగా కోడలుగా లావణ్య ఎలా మసలుకుంటుందో తెలియడం లేదు. ఉపాసన వారిలో కలిసి పోవడంతో లావణ్య కూడా అందరితో కలివిడిగా ఉండి మంచి పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తున్నారు. వివాదాలు లేకుండా మంచి కాపురం చేసి ఇరు కుటుంబాల్లో మనసున్న మనిషిగా మెలగాలని అందరు కోరుకోవడంలో తప్పులేదు.






