Lawyers protest : కర్నూలు జగన్నాథ గట్టుపై సెంట్రల్ యూనివర్సిటీ భూమి పూజ కార్యక్రమంలో మాకు అన్యాయం జరిగిందని సీనియర్ లాయర్లు నిరసనకు దిగారు. సభ ప్రారంభానికి ముందే గందరగోళం నెలకొంది. లా యూనివర్సిటీ భూమి పూజ కార్యక్రమంలో తమన్న వెనకాల కూర్చోబెట్టి వైసిపి వారికి విఐపి పాసులు ఇవ్వడం ఏంటని వారు సభలో నిలదీ శారు.
మొత్తం మీద జగన్ సభలో నిరసన వ్యక్తం అయ్యా యి. వాస్తవానికి సీనియర్ న్యాయ వాదులకు విఐపి పాసులు ఇవ్వాలి. అలాకాకుండా పాసులు ఇచ్చి వారిని ముందు కూర్చోబెట్టడం సీనియర్ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర సనలు చేసిన నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్ది చెప్పారు.