
ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. కరోనా సమయంలో మొదలైన ఈ ఉద్యోగాల కోతలు రష్యా – ఉక్రెయిన్ వార్ తర్వాత మరింతగా ముదిరింది. ఇక గత నెల అక్టోబర్ నుండి పెద్ద ఎత్తున ఉద్యోగులను పలు సంస్థలు తొలగిస్తున్నాయి. ఇక నవంబర్ పరాకాష్టకు చేరుకుంది. నవంబర్ నెలలో ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 1.37 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయి. దాంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఐటీ ఉద్యోగులు.
కరోనా మహమ్మారి నుండి ఇప్పటి వరకు 2.33 లక్షల ఉద్యోగులను తొలగించగా కేవలం అక్టోబర్, నవంబర్ లలోనే 1.60 ఉద్యోగాలు ఊడిపోయాయి. దాంతో టెకీల కుటుంబాలు తీవ్ర నిరాశ , నిస్పృహలకు లోనౌతున్నాయి. ఇక వీళ్లకు తోడు భారత్ లో కొత్తగా స్టార్టప్ కంపెనీలు అంటూ కోవిడ్ సమయంలో ప్రారంభించారు. ఇక తాజాగా మాంద్యం దెబ్బకు దాదాపు 16 వేల మందిని తొలగించారు. దాంతో ఐటీ రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ పరిస్థితి ఎన్నాళ్ళు ఉంటుందో అనే ఆందోళన చెందుతున్నారు ఐటీ ఉద్యోగులు.