
AP Politics : 2015లో ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టారు ఏపీలో. 2019 లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు పరిపాలనను ఎందుకు తిరస్కరించారో ప్రజలకే తెలియాలి. ఆ ఎన్నికల్లో చంద్రబాబు రాష్ట్రానికి ఎంతో నష్టం చేసినట్టుగా భావించి ప్రజలు వైసీపీ కి భారీ మెజార్టీ కట్టబెట్టారు. వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర అభివృద్ధి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రజల ఆశలు అడియాశలే అయ్యాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను ఘోరాతి, ఘోరంగా ఓడించి పరిపాలనకు దూరం పెట్టారు.
రాష్ట్ర విభజనతో ఏపీ గతంలో కంటే ఎక్కువ అభివృద్ధ్ది సాధిస్తుందని ఆశించారు ప్రజలు. అభివృద్ధి మాట దేవుడు ఇరుగు. ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగి వస్తాడు అనే నమ్మకం కూడా లేకుండా పోయింది. ఎక్కడ చూసిన విధ్వంసం, ఆస్తులను తగలపెట్టడం, అడ్డు వచ్చిన వారికి ఇబ్బందులు పెట్టడంతో ప్రజలు గడిచిన ఐదేళ్లల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సిన పరిస్థితి తలెత్తింది. మేము చెప్పిందే వేదం అంటూ ప్రజలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. వైసీపీ పరిపాలనతో అభివృద్ధి కంటే ఎక్కువ రాష్ట్రం నష్ట పోయిందనే ఆరోపణలు చంద్రబాబు ప్రమాణస్వీకారం వెల్లువెత్తాయి.
వైసీపీ అధినేత పరిపాలనలో ఎప్పుడు కూడా అప్పుల కోసం వెంపర్లాడటమే కనిపించింది. ఎక్కడ అప్పులు తెచ్చుకుందాం. ఏమి తాకట్టు పెడితే ఎంత అప్పు వస్తుంది అనే అంశాలపైననే దృష్టి సారించారు ఐదేళ్ల కాలంలో. విశాఖ పట్టణంలోని ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఏ ఒక్కటి మిగల్చకుండా అప్పుల కోసం తాకట్టు పెట్టారంటే ప్రభుత్వ పనితీరుకు ఆ అప్పు ఒక తార్కాణం అని చెప్పవచ్చు. సచివాలయను కూడా తాకట్టు పెట్టారనే ప్రచారం జరగడం విశేషం. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎన్ని ఆస్తులు తాకట్టు పెట్టారు అనే వివరాలన్నింటినీ లెక్క తేల్చడానికి సిద్దమైనది.
ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేశారు. ఎవరి దగ్గర ఎంత అప్పు చేశారో కూడా గణాంకాల్లో స్పష్టత కనబడుతలేదు. వడ్డీ ఇంతేనా ఫరవాలేదు. అప్పు కావాల్సిందే ఆంటూ దేశం మొత్తం తిరిగింది వైసీపీ ప్రభుత్వం. తెచ్చిన అప్పులను ఎప్పుడు కూడా అసెంబ్లీ వేదికగా ప్రకటించలేదు. పదమూడు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. అప్పులు ఎక్కడ, ఎవరిదగ్గర ఎంత తెచ్చారు. వడ్డీ ఎంత. దేనికోసం తీసుకు వచ్చారు. తెచ్చిన అప్పు దేనికి ఖర్చు చేశారు వంటి వివరాలన్నింటినీ ప్రజల ముందు బహిరంగానే ప్రకటించడానికి నూతన ప్రభుత్వం సిద్దమైనది.