Kakatiya Sculptures : వరంగల్ వేయిస్తంభాల గుడిలో నీ కళ్యాణ మండపం పునార్నిర్మాణా పనులు పూర్త వగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభించనున్నారు. శిథిలావస్థకు చేరిన దీనికి 2006లో శంకుస్థాపన జరగగా నిధుల కొరత వల్ల పనులు జాప్యం అయ్యాయి.
32000 శిలలు, శిల్పాల్లో 2540 వినియోగించగా పూర్తిగా దెబ్బతిన్న వాటిలో కొత్తవి చెక్కారు. కృష్ణ శిల చూర్ణంతో రసాయనం కలిపి నంది విగ్రహాన్ని యధావిధిగా రూపొందించారు అనంతరం ప్రాణ ప్రతిష్ట చేశారు.
ఎంతో ప్రాముఖ్యత కలిగిన వెయ్యి స్తంభాల గుడి పునర్నిర్మాణ పనులు జపం అవుతూ వచ్చాయి. 2006 సంవత్సరంలో నిర్మాణ పనులకు శంకుస్థా పన చేసినప్పటికీ పనులు మాత్రం నత్తనడకన సాగాయి. ఎంతో ప్రాముఖ్యత కలిగిన గుడి విష యంలో గత పాలకులు నిర్లక్ష్యం వహించా రడానికి ఇదే నిదర్శనం.
ఎట్టకేలకు పనులు నేటికీ పూర్తి కావడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు కాకతీయ శిల్పాలకు ప్రాణప్ర తిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేయి స్తంభాల గుడి కి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు.