Live-in Relationships : ఆధునిక యుగంలో వింత పోకడలు కామనే.. ఇందులో భాగంగానే వచ్చింది లివ్‌ఇన్ రిలేషన్. వివాహం చేసుకోకున్నా ఇద్దరు కొన్ని రోజులు కలిసి ఉంటారు. ఒకరికొకరు నచ్చితే పెళ్లి చేసుకుంటారు.. నచ్చకపోతే విడిపోయి ఎవరి దారి వారిదే. అయితే ఇలాంటిదే మారుమూల గిరిజన తెగలో ఉన్నాయంటే నమ్ముతారా? అవును నిజమండి అలాంటి తెగ ఉంది. అక్కడి ఆచారాలు మరింత డిఫరెంట్ గా ఉంటాయి.
ఈ తెగలో మహిళలు, తమకు ఇష్టమైన పురుషులతో శృంగారం చేయవచ్చు.. పిల్లలను కూడా కనవచ్చు. దీని ద్వారా వారు తమకు ఇష్టమైన భాగస్వాములను ఎన్నుకుంటారు.
రాజస్థాన్, గుజరాత్ పరిధిలోని కొండల ప్రాంతాల్లో గరాసియా తెగలు జీవనం సాగిస్తున్నాయి. ఈ తెగకు చెందిన మహిళలు చాలా వరకు పెళ్లికి ముందే తల్లి అవుతారు. తమకు నచ్చిన వారిని భర్తలుగా ఎన్నుకుంటారు.
ఈ తెగలో వివాహం అనేది కంపన్సరీ కాదు.. వివాహం కాకున్నా పురుషులు, మహిళలు కలిసి జీవించవచ్చు. దీంతో పెళ్లికి ముందే తల్లులు అవుతారు. వివాహాల కోసం రెండు రోజుల ఈవెంట్ ఉంటుంది. ఇందులో యువతీ, యువకులు గుమిగూడి, ఎవరినైనా ఇష్టపడితే, వారితో జీవించడం, కాపురం చేయడం చేస్తారు.
వివాహం చేసుకోకుండానే ఒకరితో ఒకరు శృంగారం కూడా చేయవచ్చు. ఆ తర్వాత వారు పెద్దల అంగీకారం పొంది దంపతులుగా మారచ్చు.. వారు కోరుకుంటే ఒకే.. కోరుకోకుంటే అవివాహితులుగా కూడా ఉండవచ్చు. ఈ తెగలో లివ్-ఇన్ ఆచారం ఏళ్లుగా కొనసాగుతుంది.
కొన్నేళ్ల క్రితం ఈ తెగలోని నలుగురు సోదరులు మరో చోట జీవించేందుకు వెళ్లారట. వారిలో ముగ్గురు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారట. ఒకడు పెళ్లి చేసుకోకుండానే లివ్‌ఇన్ ప్రారంభించాడట.
ఆ ముగ్గురికి పిల్లలు కలుగలేదు. కానీ నాల్గో వాడికి బిడ్డ పుట్టాడట. అప్పటి నుంచి లివ్ ఇన్ మొదలైందని అంటారు. గార్సియా ఆడవారు కోరుకుంటే ఒకరితో లివింగ్ లో ఉన్నా.. మరొకరితో సెక్స్ కాంటాక్ట్ పెట్టుకోవచ్చు. ఇలానే చాలా మంది పెళ్లికి ముందు తల్లులుగా మారుతారు.