
Delhi Elections : స్థానిక ఎన్నికల సంస్థ వీప్రిసైడ్ కూడా ఢిల్లీ ఎన్నికలపై సర్వే చేసింది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీకి 50-55 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
అలాగే బీజేపీకి 15 -20 సీట్లు వస్తాయని చెప్పగా.. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదని పేర్కొంది. మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి కూడా అధికారంలోకి వస్తుందని విప్రిసైడ్ సర్వేలో తేలింది.
‘నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్’ (NACDAOR) అలాగే ‘ది కన్వర్జెంట్ మీడియా’ సంయుక్తంగా జరిపిన సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఢిల్లీలో దళిత ఓట్లు ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీకే రానున్నాయని ఈ సర్వే వెల్లడించింది.






