మట్టిలో మాణిక్యం లాంటి ప్రతిభావంతులైన ఫోక్ సింగర్స్ కోసం టాలెంట్ హంట్ నిర్వహిస్తోంది ప్రముఖ OTT యాప్ ” LOOTT “. ఫిబ్రవరి 26 న వరంగల్ మహా నగరంలోని MASTERJI డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆవరణలో ఈ టాలెంట్ హంట్ నిర్వహించనున్నారు. అందుకోసం హన్మకొండలో తాజాగా జరిగిన కార్యక్రమంలో బ్రోచర్ ను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామ్ , UBlood app ఫౌండర్ డాక్టర్ జై యలమంచిలి, LOOTT యాప్ CMO రాజీవ్ , JSW & Jaiswaraajya.tv , LOOTT ప్రతినిధులు, స్టూడెంట్స్ అలాగే ఔత్సాహిక కళాకారులు పాల్గొన్నారు. UBlood app వంటి గొప్ప యాప్ ను సృష్టించిన జై యలమంచిలిని శాలువాతో సత్కరించారు.
జానపదం ప్రకృతి ఒడి లోంచి పుట్టింది. ఆ పల్లె పదాలను అందంగా పేర్చి , ప్రజల జీవన శైలిని అలాగే కష్టసుఖాలను ప్రతిబింభించేలా సాగే పాటలను LOOTT ద్వారా మరింత ప్రచారంలోకి తేవాలని , ప్రతిభను వెలికి తీయాలని అలాగే సరికొత్త టాలెంట్ ను చిత్ర పరిశ్రమకు అందించాలనే గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరికెందుకు ఆలస్యం ……. టాలెంట్ మీ సొంతమైతే …… ఆ టాలెంట్ ను వెలుగులోకి తెచ్చేందుకు వచ్చింది LOOTT. వెంటనే మీ వివరాలను నమోదు చేసుకోండి. అలాగే మీకు తెలిసి జానపద గేయాలను పాడే కళాకారులకు ఈ విషయం తెలియజేయండి…… వాళ్ళ అభివృద్ధి లో భాగస్వాములు అవ్వండి. 98483 51766 లేదా వాట్సాప్ నెంబర్ 8639389566 లకు మీ వివరాలను పంపిస్తే…… ఫిబ్రవరి 26 న వరంగల్ లోని మాస్టార్జీ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది.