Lokesh chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భద్రతపై కేంద్ర హోం శాఖ ప్రత్యేకంగా ఆరా తీస్తున్నది. ఇటీవల కాలంలో చంద్రబాబు పర్యటనలో అపశృతులు దొర్లుతుండడం, భద్రతా లోపం స్పష్టంగా కనిపిస్తుండడాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకున్నది. చంద్రబాబు లోకేష్ భద్రత విషయంలో పోలీసులు చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి పైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు లోకేశ్, చంద్రబాబుకు కల్పిస్తున్న భద్రతపై తక్షణమే నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ, డీజీపీకి కి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.
దీంతో ఏపీ లోని వైసీపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.
అయితే జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న చంద్రబాబు పై ఇటీవల కాలంలో జరిగిన దాడులపై కేంద్ర హోంశాఖ ఆగ్రహంగా ఉంది. అలాగే లోకేష్ పాదయాత్రకు కల్పిస్తున్న భద్రత వివరాలను వెంటనే సమర్పించాలని హోంశాఖ ఆదేశించింది. నవంబర్ 4న చంద్రబాబు ర్యాలీపై రాళ్లదాడి ఘటన పైన నివేదిక కోరింది. అలాగే లోకేశ్, చంద్రబాబు పర్యటనల్లో భద్రత కల్పించాలని డీజీపీ, చీఫ్ సెక్రటరీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జూలై 27న ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎటువంటి వివరణ ఇవ్వకుండానే , పుంగనూరులో చంద్రబాబు కాన్వాయ్ పై దాడి జరగడం, ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం, తరుచుగా చంద్రబాబు జనాల్లో తిరుగుతూ పర్యటనలు చేస్తున్నారు.ఆ పర్యటనల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం, కొంతమంది చంద్రబాబు పై దాడికి ప్రయత్నించే అవకాశం ఉండడం, తదితర అన్ని అంశాల పైన కేంద్ర హోం శాఖ దృష్టి సారించింది.