Jagan Bail day : జైలులో ఉండాల్సిన వారు బయట ఉంటున్నారు. బయట ఉండాల్సిన వారు జైలులో ఉంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ 16 నెలలు జైలులో ఉండి బెయిల్ పై బయటకు వచ్చారు. చంద్రబాబును 16 రోజులైనా జైలులో ఉంచాలని కుట్రతో ఆధారాలు లేకపోయినా జైలుకు పంపారు. దీంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ పై సెటైర్లు వేస్తున్నారు.
సీబీఐ, ఈడీ పెట్టిన 38 కేసుల్లో సీఎం జగన్ ఏ1 నిందితుడిగా రూ. 42 వేల కోట్ల ప్రజాధనం లూటీ చేశారు. ఆర్థిక ఉగ్రవాది జైలు మోహన్ ప్రజాస్వామ్య విధ్వంసానికి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. రాజ్యాంగ విలువల్ని కాలరాస్తూ నీతిగల వారిని జైలుకు పంపుతూ ఆయన మాత్రం బయట తిరుగుతున్నాడని ఎద్దేవా చేస్తున్నారు. జగన్ కు బెయిల్ డే శుభాకాంక్షలు తెలిపారు. పదేళ్లుగా బయట తిరుగుతూ ఇలాంటి నేరాలు చేయడం ఆయన స్థాయికి తగదని హితవు పలికారు.
పదేళ్లుగా బయట తిరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి జగన్ పై విమర్శలు చేస్తున్నారు. అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన వ్యక్తి వాటి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ విద్యార్హతల గురించి ఏ సర్టిఫికెట్ ఉందో ఎవరికి తెలియదు. కానీ జగన్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయం.
బయట తిరుగుతూ దోపిడీలకు పాల్పడుతున్న వారిని కాదని నిజాయితీకి పట్టం కట్టే నాయకులను జైలుకు పంపుతూ దురుద్దేశాలతో పాలన సాగిస్తున్నారు. చంద్రబాబుపై ఇప్పటి వరకు ఏ చిన్న కేసు కూడా నమోదు కాకున్నా ఇదే దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ మాజీ ముఖ్యమత్రినే జైలు పాలు చేసిన ఘనత వారికే చెల్లుతుంది. కానీ నిజం నిప్పులాంటిది. అది ఎప్పటికైనా బయట పడక మానదు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్. 42 వేల కోట్లు ప్రజాధనం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా పదేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్రవాది జైలు మోహన్ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాలరాస్తూ, నీతిమంతుల్ని జైలుకు… pic.twitter.com/UPpdTzrvDF
— Lokesh Nara (@naralokesh) September 23, 2023