
Lokesh padayatra : ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర ఇటీవలే 100 రోజుల మైలురాయిని పూర్తి చేసుకుంది. నారా లోకేశ్ తన పాదయాత్రలో భాగంగా ఒకదాని తర్వాత ఒకటి జిల్లాల్లో పర్యటిస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పట్టుున్న నియోజకవర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర ఎంటర్ అవుతుండడంతో రాష్ట్రం మొత్తం ఆసక్తిగా చూస్తుంది. వైఎస్ జగన్ స్ట్రాంగ్ జోన్ లోకి అడుగుపెట్టనున్న ఆయన పాదయాత్ర ఎలా ఉండబోతోంది అంటూ సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. ఈ యాత్ర కడప ప్రాంతంలోని జమ్మలమడుగు పట్టణంలోకి ప్రవేశిస్తుంది. వైఎస్ కుటుంబానికి అక్కడ బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్, సపోర్ట్ ఉంది. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.
లోకేశ్ పాదయాత్రకు అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే చర్చ ప్రస్తుతం ఏపీ మొత్తంలో వినిపిస్తోంది. ఇప్పటి వరకు నారా లోకేశ్ యాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉంటూ యువరాజును నడిపిస్తున్నారు. అయితే జమ్మలమడుగులో యువరాజు ఏం సాధిస్తారో వేచి చూడాలి. అక్కడ ఆయన ఏం మాట్లాడుతారు. వైసీభీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు. అంటూ పోల్స్ కూడా నడుస్తుండడం విశేషం.
గత నెల ప్రారంభంలో యువగళం యాత్ర కడప జిల్లాలోకి ప్రవేశించింది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల గుండా సాగిన ఈ యాత్ర ఈ రోజు (మే 25) సాయంత్రానికి జమ్మలమడుగులోకి ప్రవేశిస్తుంది. వైఎస్ కుటుంబానికి బలమైన ప్రాంతంగా ఉన్న ఇక్కడ నారా లోకేశ్ యాత్రతో ఏం చేస్తారో వేచి చూడాలి. జమ్మలమడుగు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి బలమైన ప్రాంతంగా ఉండేది. కానీ కొన్నేళ్లుగా పరిస్థితులు మారిపోవడంతో ఆ పార్టీ ఈ ప్రాంతంపై క్రమ క్రమంగా పట్టు కోల్పోయింది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ పాదయాత్ర ఈ ప్రాంతంలోకి అడుగుపెడుతోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.