
Lokesh Protest at Raj Ghat : నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం వైసీపీ ప్రభుత్వం నీచమైన చర్య అని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. జగన్ ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తూ చంద్రబాబు నాయుడిని ఇబ్బందులు పెడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ లో అసలు ఎటువంటి స్కాం జరగలేదని కంపెనీలు, ఐఏఎస్ లు చెప్తుంటే ఇంకెందుకు కేసు నడుపుతూ రిమాండ్ ఖైదీగా జైలులో పెట్టారని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రం విడిపోయాక ఇంతలా డెవలప్ మెంట్ అయ్యిందంటే కారణం చంద్రబాబు నాయుడే అన్నారు లోకేశ్. అలాంటి నాయకుడిని జైలులో పెట్టి ఏం సాధిస్తారని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజలు దీన్ని నిశితంగా గమనిస్తున్నారని. త్వరలో జరిగే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి డిపాజిట్లు కూడా రావని ఆయన చెప్పుకచ్చారు. ఎన్నికలు ముగిసే వరకు జైలులో పెట్టాలని కుట్రలు పన్నుతున్నట్లు ఆయన ఆరోపించారు.
చంద్రబాబు నాయుడి అరెస్ట్ ను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి న్యూ ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి వైసీపీ ప్రభుత్వంపై నిరసన తెలిపారు. చంద్రబాబు ప్రజల మనిషి అని ఆయన బయటకు రావడం ఖాయమని సీనియర్ నాయకులు అన్నారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
జైలులో ఉన్నంత మాత్రాన ఆయన తప్పు చేసినట్లు కాదని, త్వరలోనే బయటకు రావడం ఖాయమని వారు అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను గట్టిగా అడ్డుకున్న నేత చంద్రబాబు అన్నారు. మూడు రాజధానుల లాంటి అంశాన్ని రాష్ట్రం యావత్ ప్రజానీకం వ్యతిరేకంగా ఉందని, చంద్రబాబు కూడా ప్రజల వైపు నిలుచుకున్నారు. ‘బాబు బటయకు రావడం.. జగన్ ఇంటికిపోవడం’ తప్పక జరుగుతుందన్నారు.
I paid my respects to Mahatma Gandhi Ji at Rajghat in New Delhi, accompanied by senior party leaders. We joined in a black badge protest to condemn the unjust arrest of @ncbn Garu on false charges filed by the YSRCP Government. Justice will prevail.#APvsJagan#IAmWithBabu… pic.twitter.com/ziii6jOq7n
— Lokesh Nara (@naralokesh) September 19, 2023